indervelly
-
కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చే దమ్ముందా?: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, ఆదిలాబాద్: తన పాలనలో కేసీఆర్ ఏనాడూ ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచించలేదని.. ఆలోచించి ఉంటే ఇవాళ నాగోబా ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చేదని నిలదీశారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి. శుక్రవారం సాయంత్రం ఇంద్రవెల్లిలో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించిన ఆయన.. వేదిక నుంచి బీఆర్ఎస్పై, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఈ వేదిక సాక్షిగా చెబుతున్నా.. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటాం. ఈ అడవి బిడ్డల ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతాం. తప్పకుండా ఆదివాసీ కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటాం. ఇందిరమ్మ సోనియా రాజ్యం తెచ్చుకుంటాం. కేసీఆర్‌నును నేరుగా అడుగుతున్నా. ఎప్పుడైనా ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచించారా?. నిజంగా అభివృద్ధి చేస్తే ఎందుకు నీళ్ళ కోసం నాగోబా గుడి కోసం రోడ్ల కోసం నిధులు మేము ఇచ్చే పరిస్తితి ఎందుకు వచ్చింది. చెరుకు పంటలో అడవి పందులు ఏ విధంగా దాడి చేస్తాయో అదే విధంగా తెలంగాణ పై కేసీఆర్ కుటుంబం దాడి చేసి విధ్వంసం చేశారు. .. ఎంత సేపు నీ బిడ్డలు నీ ఫామ్ హౌజ్ లు తప్ప.. రాష్ట్రంలోని బిడ్డల కోసం ఆలోచించావా?. కవిత ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చావు. మరి స్టాఫ్ నర్సులు కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఇచ్చావా? అంటూ కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. బిల్లా రంగాలు(కేటీఆర్, హరీష్‌రావులను ఉద్దేశిస్తూ..) ఎంత శాప నార్ధాలు పెట్టినా 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాదే అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎవడ్రా కూల్చేది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే శాప నార్డాలు పెడుతున్నారు. మరి 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు మీరు?. ప్రభుత్వం కూలి పోతుంది అని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా?. ఎవడ్రా కూల్చేది?. ప్రజల్లారా.. మీరు ఊరుకుంటారా?. చెట్లకు కట్టేసి భరతం పట్టండి. కేసీఆర్ పాపాల భైరవుడు. మళ్లీ జీవితంలో సీఎం కారు. మూడు నెలలకో, ఆరు నెలలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతాడని ఎవరైనా అంటే పళ్లు రాలగొడతాం. .. ఆరేడు ఎంపీ సీట్లు వస్తాయని కేసీఆర్ అంటున్నారు. వస్తే మోదీకి అమ్ముకుందాం అనా?. దేశంలో ఉన్నవి రెండే కూటములు. ఒకటి మోదీ కూటమి.. రెండోది ఇండియా కూటమి. కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమిలోకి రానివ్వం. ఆ ఇంటి పిట్టను ఈ ఇంటి మీద వాలితే కాల్చి పారేస్తాం. మోదీ కేడీ(కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ..) ఇద్దరూ కలిసి కాంగ్రెస్ ను అడ్డుకోవాలని చూస్తున్నారు. మళ్లీ మతం పేరుతో వాళ్లు ఎన్నికలకు వస్తున్నారు. మోదీ ఎవరి ఖాతాలో అయినా రూ.15 లక్షలు జమ చేశారా? సోయంబాపురావుకు కనీసం కేంద్ర మంత్రి కూడా ఇవ్వలేకపోయారు. అలాంటప్పుడు ఓటేందుకు వేయాలి?. రాహుల్ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురాలి. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో ఆలోచించాలి’’ అని ప్రజల్ని కోరారాయన. కడెం మరమ్మత్తుల బాధ్యత మాది కోటి ఎకరాలకు నీళ్లు అన్నావ్? వస్తావా కేసీఆర్ ఆదిలాబాద్‌ను చూపిస్తాం. హెలికాఫ్టర్ పెడతాం.. ఎక్కడ నీళ్లు ఇచ్చావో చూపించు అని కేసీఆర్‌పై రేవంత్ ధ్వజమెత్తారు. ఇక.. తెలంగాణలో మహిళలకు రూ. 500 కు సిలిండర్ గ్యాస్ అందించే పథకం త్వరలోనే అమలు చేస్తామని.. 200 యూనిట్ల ఉచిత కరెంట్ త్వరలోనే అమలు చేస్తామని రేవంత్ అన్నారు. ‘‘తుమ్మిడి హిట్టి వద్ద ప్రాజెక్టు పూర్తి చేస్తాం. కడెం ప్రాజెక్టు మరమ్మతులు చేసే బాధ్యత మాది’’ అని రేవంత్ ప్రకటించారు. త్వరలోనే ఆ రెండు హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు హామీల అమలులో భాగంగా.. త్వరలో రెండింటిని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన దర్బార్ కార్యక్రమంలో మాట్లాడరు. ఈ సందర్భంగా.. అతిత్వరలోనే రూ.500కి గ్యాస్ సిలిండర్ అందిస్తామని, అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ అమలు చేస్తామని ప్రకటించారు. మరికాసేపట్లో ఇంద్రవెల్లి అమరుల స్థూపానికి గౌరవ వందనం సమర్పించి.. అక్కడి సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి ఆయన ప్రసంగిస్తారు. ప్రత్యేక పూజలు ఇక.. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఎనుముల రేవంత్‌రెడ్డి నాగోబాను దర్శించుకున్నారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం విక్రమార్కతోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
వ్యవసాయ కూలీలతో భోజనం చేసిన ఎమ్మెల్యే రేఖానాయక్
సాక్షి, ఆదిలాబాద్: ప్రజా జీవితంలో, పార్టీ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉండే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ శుక్రవారం పంట పొలాల్లో కనిపించారు. ఇంద్రవెల్లి మండలంలోని దనోర బి గ్రామానికి వెళ్తున్న సమయంలో పంట చేలల్లో పనిచేస్తున్న వారిని చూసి వారి వద్దకు వెళ్లారు. కూలీలతో కలిసి భోజనం చేశారు. తాను చిన్నప్పుడు అమ్మమ్మతో కలిసి చేనులోకి వెళ్లి సరదగా పని చేసిన పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా అక్కడ పని చేస్తున్న మహిళలు ఎమ్మెల్యేతో పలు సమస్యలను విన్నవించారు. తాము ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారమని, పేదరికంలో ఉన్నామని చెప్పడంతో.. స్పందించిన ఎమ్మెల్యే రెండో దశ దళితబంధులో మీకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఎంపీపీ పోటే శోభాబాయి, పీఏసీఎస్ చైర్మన్ మారుతి డోంగ్రె, సర్పంచ్ కోరెంగా గాంధారి, ఎంపీటీసీ సభ్యులు జాదవ్ స్వర్ణలత, గిత్తే ఆశాబాయి ఉన్నారు. చదవండి: ‘చీకోటి’ వెనుక ఉన్న చీకటి మిత్రులెవరూ? -
కుట్రలను తిప్పికొట్టాలి
ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రాంత పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, లోక్‌సత్తా పార్టీల అగ్రనాయకులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్ర పన్నారని, వారి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మండల కేంద్రంలోని హీరాపూర్‌కు చెందిన సూర్యవంశీ జ్ఞానేశ్వర్ రోడ్డు ప్రమాదంలో చనిపోగా ఆయన కుటుంబ సభ్యులను మందకృష్ణ సోమవారం పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి శాసనసభకు పంపించిన తెలంగాణ బిల్లుపై చర్చలు జరిపి అభిప్రాయూలు సేకరించకుండా సీమాంధ్ర నాయకులు అడ్డుకున్నారని విమర్శించారు. శాసనసభ స్పీకర్ సమావేశాలను వారుుదా వేయడం వెనుక సీమాంధ్రుల హస్తం ఉందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల త్యాగాలు, బలిదానాలు వృథాపోనివ్వకుండా ఈ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీలకతీతంగా బిల్లుపై చర్చ జరిగేలా పోరాడాలని కోరారు. రాజకీయూల్లో తక్కువ సంఖ్యలో ఉన్న అగ్రవర్ణ కులాలదే ఆధిపత్యం కొనసాగుతుండడంతో పేదలకు సంక్షేమ పథకాలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలన కోసం కేటారుుంచిన సంక్షేమ నిధులను రాజకీయ నాయకులు, వారి కుటుంబాల సభ్యులు దిగమింగుతున్నారని ఆరోపించారు. జనవరి 4వ తేదీన ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యలో రాజకీయ పార్టీ స్థాపించి సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన కోసం, కుటుంబ రాజకీయూలు, కులాధిపత్యం, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పారు. సంఘం తూర్పు జిల్లా అధ్యక్షుడు రేగుంట సునీల్, జిల్లా కో ఆర్డినేటర్ కాంబ్లే బాలాజీ, మండల అధ్యక్షుడు సూర్యవంశీ మాధవ్, రజీహైమద్ పాల్గొన్నారు. -
ప్రజావేదికలో భారీగా అవినీతి అక్రమాలు
ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ : వలసలను నిరోధించి కూలీలకు ఉపాధి కల్పించి ఆర్థిక చేకూర్పు అందించాలనే లక్ష్యం తో ప్రారంభించిన ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు అండగా మారుతోంది. ఎక్కడ తని ఖీలు నిర్వహించినా లక్షల రూపాయల్లో చోటుచేసుకున్న అవినీతి వెలుగులోకొస్తోంది. తాజా గా.. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నిర్వహించి న ప్రజావేదికలో భారీగా అవినీతి అక్రమాలు వెలుగుచూశాయి. జూన్ 1, 2012 నుంచి జూలై 30, 2013 వరకు చేపట్టిన ఉపాధి హామీ పను ల్లో సామాజిక తనిఖీ నిర్వహించారు. దీనిపై శని వారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో డ్వామా అడిషనల్ పీడీ గణేష్ అధ్యతన ప్రజావేదిక నిర్వహించారు. ఇందులో భాగంగా పనులు చేసేందుకు కూలీల నుంచి ప్రతిసారీ రూ.వంద వసూళ్లకు పాల్పడిన దొ డంద ఫీల్డ్అసిస్టెంట్ రాథోడ్ ఉత్తంను సస్పెండ్ చేశారు. అదే గ్రామానికి చెందిన పది మంది మే ట్లను తొలగించారు. దస్నాపూర్ గ్రామపంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ అసిస్టెంట్ కె.దేవిదాస్ ఉపాధి పనులు కల్పించడంలో చేసిన నిర్లక్ష్యం.. ఆడిట్ బృందానికి సహకరించకపోవ డం.. ప్రజావేదికకు హాజరుకాకపోవడంతో అత న్ని కూడా సస్పెండ్ చేశారు. దస్నాపూర్‌లో పిం ఛన్, ఉపకార వేతనాలు, అభయహస్తంకు సం బంధించి రూ.65 వేలు స్వాహా చేసిన వీఆర్వో మడావి పుష్ప, సీఎస్పీల నుంచి నిధులు రికవరీ చేయించాలని ఆదేశించారు. అంతేగాకుండా సీఏ సిడాం జంగును సస్పెండ్ చేశారు. దేవాపూర్‌లోని మేట్లు రాజేశ్వర్, బాలాజీ, విశ్వనాథ్ పనిచే యని కూలీల పేర నిధులు స్వాహా చేసినందుకు ముగ్గురినీ తొలగించారు. రెండేళ్ల పాటు ఉపాధి పనుల నుంచి బహిష్కరించారు. ఏమైకుంట గ్రామంలోని మేట్ రాజేశ్వర్ ఇష్టారాజ్యం గా పేర్లు నమోదు చేసినందుకు అతన్ని తొలగిం చారు. లొకేషన్ మార్చి పనులు కల్పించినందుకు ఇంద్రవెల్లి, దేవాపూర్, ముట్నూర్ ఎఫ్ఏలపై రికవరీ పెట్టారు. ఇంద్రవెల్లిలో రూ.60 వేలు, దేవాపూర్ రూ.60 వేలు, ముట్నూర్లో రూ.70 వేలు స్వాహా చేసినందుకు రికవరీ చేయాలన్నారు. మరో 28 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లు ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యం చేయడంతో ఎఫ్‌ఏలకు రూ.3 వేలు, టెక్నికల్ అసిస్టెంట్లకు రూ.2 వేల చొప్పున జరిమానా విధించారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి కొండయ్య, అంబుడ్స్‌మెన్ మెస్రం నాగోరావ్, ఎంపీడీవో రమాకాంత్, ఏపీవో చంద్రయ్య, ప్రత్యేక అధికారి శ్యామ్‌రావ్ రాథోడ్, ఎస్సార్పీ ప్రభు, డీఆర్పీలు, కూలీలు, ప్రజలు హాజరయ్యారు.