ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ : వలసలను నిరోధించి కూలీలకు ఉపాధి కల్పించి ఆర్థిక చేకూర్పు అందించాలనే లక్ష్యం తో ప్రారంభించిన ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు అండగా మారుతోంది. ఎక్కడ తని ఖీలు నిర్వహించినా లక్షల రూపాయల్లో చోటుచేసుకున్న అవినీతి వెలుగులోకొస్తోంది. తాజా గా.. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నిర్వహించి న ప్రజావేదికలో భారీగా అవినీతి అక్రమాలు వెలుగుచూశాయి. జూన్ 1, 2012 నుంచి జూలై 30, 2013 వరకు చేపట్టిన ఉపాధి హామీ పను ల్లో సామాజిక తనిఖీ నిర్వహించారు. దీనిపై శని వారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో డ్వామా అడిషనల్ పీడీ గణేష్ అధ్యతన ప్రజావేదిక నిర్వహించారు. ఇందులో భాగంగా పనులు చేసేందుకు కూలీల నుంచి ప్రతిసారీ రూ.వంద వసూళ్లకు పాల్పడిన దొ డంద ఫీల్డ్‌అసిస్టెంట్ రాథోడ్ ఉత్తంను సస్పెండ్ చేశారు.
అదే గ్రామానికి చెందిన పది మంది మే ట్లను తొలగించారు. దస్నాపూర్ గ్రామపంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ అసిస్టెంట్ కె.దేవిదాస్ ఉపాధి పనులు కల్పించడంలో చేసిన నిర్లక్ష్యం.. ఆడిట్ బృందానికి సహకరించకపోవ డం.. ప్రజావేదికకు హాజరుకాకపోవడంతో అత న్ని కూడా సస్పెండ్ చేశారు. దస్నాపూర్‌లో పిం ఛన్, ఉపకార వేతనాలు, అభయహస్తంకు సం బంధించి రూ.65 వేలు స్వాహా చేసిన వీఆర్వో మడావి పుష్ప, సీఎస్పీల నుంచి నిధులు రికవరీ చేయించాలని ఆదేశించారు. అంతేగాకుండా సీఏ సిడాం జంగును సస్పెండ్ చేశారు. దేవాపూర్‌లోని మేట్లు రాజేశ్వర్, బాలాజీ, విశ్వనాథ్ పనిచే యని కూలీల పేర నిధులు స్వాహా చేసినందుకు ముగ్గురినీ తొలగించారు. రెండేళ్ల పాటు ఉపాధి పనుల నుంచి బహిష్కరించారు.
ఏమైకుంట గ్రామంలోని మేట్ రాజేశ్వర్ ఇష్టారాజ్యం గా పేర్లు నమోదు చేసినందుకు అతన్ని తొలగిం చారు. లొకేషన్ మార్చి పనులు కల్పించినందుకు ఇంద్రవెల్లి, దేవాపూర్, ముట్నూర్ ఎఫ్‌ఏలపై రికవరీ పెట్టారు. ఇంద్రవెల్లిలో రూ.60 వేలు, దేవాపూర్ రూ.60 వేలు, ముట్నూర్‌లో రూ.70 వేలు స్వాహా చేసినందుకు రికవరీ చేయాలన్నారు. మరో 28 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లు ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యం చేయడంతో ఎఫ్‌ఏలకు రూ.3 వేలు, టెక్నికల్ అసిస్టెంట్లకు రూ.2 వేల చొప్పున జరిమానా విధించారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి కొండయ్య, అంబుడ్స్‌మెన్ మెస్రం నాగోరావ్, ఎంపీడీవో రమాకాంత్, ఏపీవో చంద్రయ్య, ప్రత్యేక అధికారి శ్యామ్‌రావ్ రాథోడ్, ఎస్సార్పీ ప్రభు, డీఆర్పీలు, కూలీలు, ప్రజలు హాజరయ్యారు.
ప్రజావేదికలో భారీగా అవినీతి అక్రమాలు
Published Sun, Sep 22 2013 4:12 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement