తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. రాష్ట్ర విభజన అంశంపై జరుగుతున్న పరిణామాలను వారు రాష్ట్రపతికి వివరిస్తారు.
రాష్ట్రపతిని కలవడానికి ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంత్రి జానారెడ్డి నివాసంలో ఉదయం 10 గంటలకు సమావేశమవుతారు. రాష్ట్రపతికి ఇచ్చే వినతి పత్రంపై వారు చర్చిస్తారు.