రాష్ట్రపతిని పోటాపోటీగా కలుస్తున్న నేతలు
సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిదికోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిసేందుకు కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ, సీమాంధ్ర నేతలు పోటాపోటీగా సిద్ధమవుతున్నారు. రాష్ట్ర విభజన బిల్లులో అనేక లోపాలున్నాయుని, సీవూంధ్రకు తీరని అన్యాయుం జరగనున్నదని, దాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని ప్రణబ్‌ను కోరాలని సీవూంధ్ర నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే అపారుుంట్‌మెంట్ కోరావుని, ఆయున్నుంచి స్పందన రాగానే కలుస్తావుని చెబుతున్నారు. వుంత్రి కాసు కృష్ణారెడ్డి ఇప్పటికే రాష్ట్రపతిని కలసి రాష్ట్ర సమైక్యతకోసం వినతిపత్రం అందించారు.
మరోవైపు టీ కాంగ్రెస్ నేతలు విభజన బిల్లుపై రాష్ట్రపతి 40 రోజుల గడువిచ్చినా అసెంబ్లీలో చర్చ కొనసాగకుండా సీవూంధ్ర నేతలు కావాలనే జాప్యం చేస్తున్నారంటూ ఆయన దృష్టికి తేవాలని నిర్ణరుుంచారు. ‘‘చర్చను ఆలస్యం చేసి చివర్లో వురింత గడువు కోరాలని, తద్వారా పార్లమెంటులో టీ-బిల్లు రాకుండా అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు. కాబట్టి చర్చకు అదనపు గడువు ఇవ్వరాదు’’ అని విన్నవించనున్నారు. శుక్రవారం రాష్ట్రపతిని కలసిన వుంత్రులు దానం నాగేందర్, వుుకేశ్‌గౌడ్ ఇదే అంశాల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రపతిని ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా కలిశారు. మరోవైపు వుంత్రి కె.జానారెడ్డి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.
రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరిన టీఆర్‌ఎస్: ముసాయిదా బిల్లుపై శాసనసభలో జరుగుతున్న పరిణామాలను రాష్ట్రపతిని కలిసి వివరించాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ప్రతినిధులు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరారు. అసెంబ్లీలో, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అంశాలను రాష్ట్రపతికి తెలియజేస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు.
నేడు ప్రణబ్‌ను కలవనున్న సీమాంధ్ర టీడీపీ నేతలు: సీమాంధ్ర ప్రాంత తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నేతలు ఆదివారం సాయంత్రం ప్రణబ్‌ను కలవనున్నారు. అసెంబ్లీకి వచ్చిన రాష్ట్ర విభజన బిల్లులో పలు లోపాలున్నందున వెంటనే వెనక్కు తెప్పించుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు.