`పార్టీలపరంగా దారులు వేరైనా మా గమ్యం ఒక్కటే`
హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, మంత్రి జానారెడ్డితో భేటీ అయిన నేపధ్యంలో పార్టీల పరంగా దారులు వేరైనా తమ గమ్యం ఒక్కటేనని మంత్రి జానారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై తమతో కేసీఆర్ చర్చించారని చెప్పారు. తెలంగాణ బిల్లులో ఉన్న అంశాలపై పార్టీలపరంగా చర్చించుకుంటున్నామని జానారెడ్డి అన్నారు.
తెలంగాణ వచ్చేవరకూ ఇదే ఐక్యతను కొనసాగిస్తామని తెలిపారు. కాగా, ఈరోజు రాత్రి 7.45 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కేసీఆర్ సమావేశం కానున్నట్టు సమాచారం. ఈ భేటీలో మంత్రులు బస్వరాజు సారయ్య, ఉత్తమ్కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.