
ఒక్క‘టి’గా పోరాడుదాం
తెలంగాణ బిల్లు ఆమోదంపై టీ-నేతల నిర్ణయం
జానారెడ్డి నివాసంలో కేసీఆర్, ఇతర నేతల భేటీ
2న అన్నిపార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై పార్లమెంట్ ఆమోదముద్ర పడేవరకు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులంతా పార్టీలకు అతీతంగా ఐక్యంగా పోరాటం చేయూలని ఇక్కడి నాయకులు నిర్ణయించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు నష్టం వాటిల్లే అనేక అంశాలున్నందున వాటికి అసెంబ్లీలో సవరణలను ప్రతిపాదించాలన్న అభిప్రాయానికి వచ్చారు. గురువారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి నివాసంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతల భేటీ జరిగింది. తొలుత టీఆర్‌ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు సతీమణి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతల వుధ్య పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లులోని అంశాల గురించి చర్చ వచ్చింది. ఈ బిల్లులోని పలు అంశాలు తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం కలి గించేలా ఉన్నాయని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేకపోతే భవిష్యత్తులో ఇబ్బందుల పాలవుతావుని కేసీఆర్ ఈ సందర్భంగా జానారెడ్డితో పేర్కొన్నారు. అయితే ఈ అంశాలపై వివరంగా చర్చిద్దాం రవ్ముని జానారెడ్డి తన నివాసానికి కేసీఆర్‌ను ఇతర టీఆర్‌ఎస్ నేతలను ఆహ్వానించారు. కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ నేతలు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, గంగుల కవులాకర్, పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి వుంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సారయ్య, ఎంపీలు పొన్నం ప్రభాకర్, వుధుయూ ష్కీ, ఎమ్మెల్యే భిక్షమయ్యుగౌడ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.
బిల్లులో తెలంగాణకు నష్టం కలిగించే విధంగా ఉన్న అంశాలపై కేసీఆర్ ఈ సవూవేశంలో కాంగ్రెస్ నేతలకు వివరంగా చెప్పారు. పదవీ విరవుణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ల చెల్లింపు అంశం భవిష్యత్తులో తెలంగాణకు పెనుభారమవుతుందని చెప్పారు. సీవూంధ్రప్రాంతానికి చెందిన వేలాది వుంది ఉద్యోగులు వివిధ వూర్గాల్లో తెలంగాణకు వచ్చి ఇక్కడే పదవీ విరవుణ పొందారని, వారు ఇక్కడే రిటైరైనందున పెన్షన్లను తెలంగాణ రాష్ట్రమే ఇవ్వాలన్న నిబంధన వల్ల రాష్ట్రంపై ఆర్థికంగా భారం పడుతుందని తెలిపారు. ఉద్యోగుల కేటాయింపు విషయంలో జనాభాప్రాతిపదికన కాకుండా ఏప్రాంతం వారిని ఆప్రాంతానికి పం పించేలా ఉండాలన్నారు. నేటివిటీని అనుసరించి ఆయూ ప్రాంతాలకు ఉద్యోగులను కేటారుుంచాల్సి ఉంటుందని కేసీఆర్ చెప్పారు.
హైకోర్టులో మనకు న్యాయం ఎలా?
రాష్ట్ర విభజన తరువాత కొంతకాలం ఒకటే హైకోర్టు ఉంటుందని బిల్లులో పేర్కొనడంపై నేతల వుధ్య చర్చ జరిగింది. ‘ప్రస్తుతం హైకోర్టులో సీవూంధ్రప్రాంత ఆధిపత్యం ఎక్కువగా ఉంది. రాష్ట్ర విభజన తరువాత అనేక అంశాలపై న్యాయుపరమైన వివాదాలు తలెత్తుతారుు. ఇరు ప్రాంతాలకు సంబంధించి అనేక సవుస్యలపై హైకోర్టును ఆశ్రయించక తప్పదు. అక్కడ సీవూంధ్ర ఆధిపత్యం ఉన్నందున తెలంగాణకు న్యాయుం జరగడం కష్టం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే సీమాంధ్రకు కూడా హైకోర్టును ఏర్పాటు చేయూల్సిందే. లేదంటే ప్రతి విషయుంలోనూ న్యాయుస్థానం నుంచి స్టే ఉత్తర్వులతో ప్రభుత్వం ముందుకు వెళ్లడం కష్టం అవుతుంది’ అని నేతలు అభిప్రాయపడ్డారు. విద్యుత్తు విషయుంలోనూ తిప్పలు తప్పవని కేసీఆర్ కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. ‘సీమాంధ్ర నేతల పాలనలో తెలంగాణలో విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటులో అన్యాయుం జరిగింది. బొగ్గు నిక్షేపాలు తెలంగాణలో ఉన్నా ప్రాజెక్టులన్నీ సీవూంధ్రలో పెట్టారు. రాష్ట్రం రెండుగా విడిపోతున్నందున తెలంగాణ అవసరాలకు విద్యుత్తు కొనుగోలు చేయూలంటే ఇప్పుడున్న రేట్లతో చాలా కష్టం అవుతుంది. అందుకే తెలంగాణలో ఉన్న కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రాజెక్టుల విద్యుత్తులో అత్యధిక భాగం తెలంగాణకు వచ్చేలా చూడాలి. అప్పుల విషయుం లోనూ ఏరాష్ట్ర ప్రాజెక్టులకు ఖర్చుచేసిన నిధులు ఆరాష్ట్రమే తీర్చాల్సిందిగా బిల్లులో స్పష్టంగా ఉంచాలి. గోదావరిపై బోర్డు వేయుడాన్ని వ్యతిరేకించాలి’ అని సవూవేశంలో నిర్ణరుుంచారు. కృష్ణాబోర్డు కూడా తెలంగాణలో ఉండేలా చూడాలని భావిస్తున్నారు. తెలంగాణపై కేంద్రం చెప్పేదొకటి, చేస్తున్నదింకొకటిగా ఉంటోందని కేసీఆర్ కాంగ్రెస్ నేతలతో వ్యాఖ్యానించారు. ఈ విషయుంలో తెలంగాణకు అన్యాయుం జరగకుండా కాంగ్రెస్ నేతలు అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని సూచించారు.
రాజకీయ కోణం లేదు: హరీష్
మంత్రి జానారెడ్డి నివాసంలో పలువురు కాంగ్రెస్ నేతలతో కేసీఆర్, తమ పార్టీ నేతలు భేటీ కావడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకుడు టి.హరీష్‌రావు తెలిపారు. గురువారం రాత్రి పార్టీ నేతలు రాష్ట్రపతితో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ బిల్లులోని పలు అభ్యంతరాలు విషయంలో ఎలా వ్యవహరించాలి అన్న దానిపై చర్చించామన్నారు.
అసెంబ్లీకి ముందే అఖిలపక్షం
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును అసెంబ్లీలో యుథాతథంగా ఆమోదించి పంపిస్తే పార్లమెంటులో సవరణలకు ఆస్కారం తక్కువగా ఉంటుందని దీనివల్ల నష్టం వాటిల్లుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. బిల్లుపై అసెం బ్లీలో చర్చ సందర్భంగానే సవరణలను ప్రతిపాదించి పంపించాలని నిర్ణరుుంచారు. ఇందుకోసం తెలంగాణ ప్రాంతంలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఒకేతాటిపై నడవాలని కేసీఆర్ సూచించారు. ఇందుకు అసెంబ్లీ సవూవేశాలకు వుుందే అఖిలపక్షాన్ని ఏర్పాటుచేయూలని ఆయన జానారెడ్డికి చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలంతా ఒకే స్వరం వినిపించడం ద్వారానే బిల్లులోని లోపాలకు సవరణలు సాధ్యవువుతుందని కేసీఆర్ స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, ఎంఐఎం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సవూవేశం ఏర్పాటుచేయునున్నారు. జనవరి రెండో తేదీన కానీ, వుూడో తేదీన కానీ ఈ సవూవేశం ఉండొచ్చని నేతలు తెలిపారు. సవూవేశానంతరం జానారెడ్డి మీడియూతో వూట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించేవరకూ ఈప్రాంత పార్టీల నేతలంతా ఏకతాటిపై నడుస్తావుని వివరించారు. పార్టీలు, విధానాలు వేరైనా అందరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రమేనని స్పష్టంచేశారు.