తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. జాతీయ విపత్తు నివారణ నిర్వహణ సంస్థ వైస్ చైర్మన్, శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు.
తెలంగాణకు ఉన్న లోక్సభ స్థానాలను, అసెంబ్లీ స్థానాలను పెంచాలని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. సమావేశంలో నేతల అభిప్రాయాలను జిఓఎంకు ఇవ్వాలని నిర్ణయించారు.