హైదరాబాద్ : హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగుల హక్కుల గురించి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగ జేఏసీ నేతలు మండిపడ్డారు. సీమాంధ్రకు కనీస న్యాయం చేయకుండా కాంగ్రెస్, బేజేపీలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాయని వారు ధ్వజమెత్తారు. తెలంగాణలో సెటిలైన సీమాంధ్రులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సీమాంధ్రులకు అండగా ఉంటామంటూ తెలంగాణ నేతలు మాట్లాడటం ఒక ఫ్యాషన్గా మారిందని జేఏసీ నేతలు ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులకు ప్రత్యేక భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.