‘సీమాంధ్ర ఉద్యోగుల కుట్రలను తిప్పికొడతాం’ | Telangana Electricity Engineers Association comments on Seemandhra employees | Sakshi
Sakshi News home page

‘సీమాంధ్ర ఉద్యోగుల కుట్రలను తిప్పికొడతాం’

Published Sat, Aug 12 2017 2:01 AM | Last Updated on Mon, Sep 11 2017 11:50 PM

Telangana Electricity Engineers Association comments on Seemandhra employees

హైదరాబాద్‌: తెలంగాణ విద్యుత్‌ సంస్థకు మరోమారు అన్యాయం జరగకుండా మా ఉద్యోగాలు మేము కాపాడుకుంటామని, ఇక్కడినుంచి రిలీవ్‌ అయినా ఇక్కడే ఉండేందుకు చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల కుట్రలను తిప్పికొడతామని టీఎస్‌పీడీసీఎల్‌ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. శుక్రవారం మింట్‌ కంపౌండ్‌లోని టీఎస్‌పీడీసీఎల్‌ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కార్పొరేట్‌ కార్యాలయంలో సామూహిక నిరాహారదీక్షను చేపట్టారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థల కుట్రలు తెలంగాణ విద్యుత్‌ సంస్థ పురోగతికి అడ్డంగా మారుతున్నాయన్నారు. ఏపీకి వెళ్తామని ధర్నాలు చేస్తూనే మరోవైపు ఏపీ మేనేజ్‌మెంట్‌తో కలసి మాపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగులను ఏపీకి పంపేందుకు చేస్తున్న ఈ పోరా టంలో తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా టీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీకి, ఎస్‌పీడీసీఎల్‌ హెచ్‌ఆర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement