Telangana electricity company
-
తెలంగాణ విద్యుత్ సంస్థలకు కొత్త బాస్‌లు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీలు, డైరెక్టర్ల మార్పు, కొత్తవారి నియామకంపై ఊహా గానాలు ఊపందుకున్నాయి. కొత్త సీఎండీలు, డైరెక్టర్ల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించిందని చెబుతున్నారు. సింగరేణి సంస్థ సీఎండీగా ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఎన్.శ్రీధర్.. ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల సీఎండీ రేసులో ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. అయితే ఆయన ఇప్పటికే ఆయన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ సీఎండీగా ఎంపికైనా, ఇంకా నియామక ఉత్తర్వులు జారీ కాలేదు. శ్రీధర్ కాకుంటే, సీఎంకు అత్యంత విశ్వసనీయంగా ఉండే సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో ఒకరిని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. తనకు విముక్తి కల్పించాలంటున్న ప్రభాకర్‌రావు.. తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) సీఎండీగా, విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో)ల ఇన్చార్జి సీఎండీగా డి.ప్రభాకర్‌రావు గత నెలతో 9 ఏళ్లు, 2019 జనవరి 10 నాటికి విద్యుత్ సంస్థల్లో 50 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించారు. ఆయన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌గా 1969 జనవరి 10న ఎలక్ట్రిసిటీ బోర్డులో చేరారు. విద్యుత్ రంగానికి సంబంధించిన విధానాల రూపకల్పన, నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ (టీఎస్పీసీసీ) చైర్మన్ హోదాలో ఆయన డిస్కంల నిర్వహణను సైతం పర్యవేక్షించారు. ఆయనకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) హోదాను కట్టబెట్టి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రస్తుతం 76 ఏళ్ల వయస్సులో ప్రభాకర్‌రావు వయోభారం, అనా రోగ్య సమస్యలతో ఇబ్బందులు పడు తున్నారు. తనను బాధ్యతల నుంచి తప్పిస్తే విశ్రాంతి తీసు కుంటానని గతంలో ఆయన విజ్ఞప్తి చేయగా సీఎం కేసీఆర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా ఆయన బహిరంగ సభల్లో తనకు బాధ్యతల నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సమీప భవిష్యత్తులో తాను బాధ్యతల నుంచి తప్పు కున్నా మరో విధంగా భావించవద్దని విద్యుత్ ఉద్యోగులకు ఆయన తాజా గా విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తులపై ప్రభుత్వం నుంచి సాను కూల సంకేతాలు అందిన నేపథ్యంలోనే ఆయనీ ప్రకటనలు చేశారని విద్యుత్ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 80 ఏళ్లకు చేరువలో ఉత్తర డిస్కం సీఎండీ.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీ డీసీఎల్) సీఎండీగా ఎ.గోపాల్ రావు ఆరున్నరేళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన 2003లో చీఫ్ ఇంజనీర్‌గా రిటైరయ్యారు. ప్రస్తు తం ఆయన వయస్సు 78 ఏళ్లకు పైనే. వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఆయన వృద్ధాప్య సమ స్యల వల్ల తరుచుగా హైదరాబాద్‌కు రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యుత్ శాఖ వర్గాలు చెబుతు న్నాయి. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని అంటున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీగా జి.రఘుమా రెడ్డి సైతం ఈ నెలలో 9 ఏళ్లను పూర్తి చేసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు కూడా 71 ఏళ్లకు పైనే. ఒక వేళ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీగా నాన్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తే ఈయన పేరును సైతం పరిశీలించే అవకాశం ఉంది. డైరెక్టర్లు కూడా దీర్ఘకాలంగా.. టీఎస్ఎస్పీడీసీఎల్లో 8 మంది, టీఎస్ఎన్పీ డీసీఎల్‌లో ఆరుగురు, ట్రాన్స్‌కోలో జేఎండీ, మరో నలుగురు డైరెక్టర్లు, జెన్కోలో ఆరుగురు డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో చాలామంది 9 ఏళ్లకు పైగా ఆయా పదవుల్లో కొనసాగు తున్నారు. వీరిలో చాలామంది 70 ఏళ్లకు పైబడిన వారే. కొన్ని విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల సంఖ్య మంజూరైన పోస్టు ల సంఖ్య కంటే పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కొందరు డైరెక్టర్లను సాగనంపి వారి స్థానంలో కొత్తవారిని నియమించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. -
ఆర్థిక సంక్షోభంలో విద్యుత్ సంస్థలు
సాక్షి, హైదరాబాద్: ‘సాంకేతిక సామర్థ్యంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు దేశంలోని ఇతర డిస్కంల కంటే ముందున్నా...ఆర్థికంగా కొంత వెనుకబడిపోయాయి. నష్టాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆయా పంపిణీ సంస్థల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఈ నష్టాల నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలు గట్టెక్కాలంటే మీటర్ సేల్స్ పెంచాలి. అంతర్గత వృథా ఖర్చులు తగ్గించుకోవాలి’ అని తెలంగాణ విద్యుత్ (టాన్స్‌కో,జెన్కో) సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అభిప్రాయపడ్డా రు. శనివారం ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ అఫీసర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ–2023 ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాం. ట్రాన్స్‌కో, జెన్కో సంస్థలు కొంత మెరుగ్గా ఉన్నా.. పంపిణీ సంస్థలు మాత్రం నష్టాలను చవి చూస్తున్నాయి. ప్రభుత్వం అనేక విధాలుగా సహకరిస్తున్నా నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నష్టాల్లో ఉన్న సంస్థలను ఇక లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగిపై ఉంది. లేదంటే సంస్థల మనుగడే కాదు ఉద్యోగుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం రోజుకో రకమైన సైబర్ క్రైం వెలుగు చూస్తోంది. విద్యుత్ సంస్థలకు ఈ క్రైం సవాల్ విసురుతోంది. ఇంజనీర్లు, అకౌంటెంట్లు ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలి. సైబర్ నేరగాళ్లకు సంస్థలు చిక్కకుండా చూడాలి. సాంకేతిక పరిజ్ఞానమే కాదు ఆర్థిక వనరులు వారి చేతికి చిక్కకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉంది. అకౌంటెంట్లు కేవలం అకౌంట్స్‌ను నిర్వహించడమే కాదు బ్యాలెన్స్ షీట్‌ను మెయింటెన్ చేయాలి. సంస్థ ఖాతాలో నిల్వలు ఉన్నప్పుడే అవసరానికి, అభివృద్ధి పనులకు బ్యాంకులు, ఇతర సంస్థలు అప్పులు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. నిల్వలు లేక పోతే అప్పులు కూడా పుట్టవు.’అని సీ ఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. ఆ డబ్బులు సొంతానికి వాడుకుంటే ఎలా? సీఎండీ రఘుమారెడ్డి ‘వినియోగదారుల నుంచి వసూలు చేసిన విద్యుత్ బిల్లులను, వెంటనే సంస్థ ఖాతాలో జమ చేయడం లేదు. వీటిని కొంత మంది ఉద్యోగులు సొంత ఖర్చులకు వాడుకుంటున్నారు. వరుస డోర్‌లాక్‌లు, మీటర్ స్టకప్‌లు వంటి అంశాలను ఈఆర్ఓలు మానిటరింగ్ చేయడం లేదు. పరోక్షంగా సంస్థ నష్టాలకు కారణమవుతున్నారు. వినియోగదారులు చెల్లించిన మొత్తాన్ని సొంత అవసరాలకు వాడుకుంటే ఎలా? ఈఆర్ఓ కేంద్రాల్లోని అకౌంటెంట్లు ఏం చేస్తున్నారు? ఎప్పటికప్పుడు బిల్లులు, ఇతర అంశాలను మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత మీపై లేదా..? ఈఆర్ఓ కో ఆర్డినేషన్ మీటింగ్‌లో ఏం చర్చిస్తున్నారు? అన్‌బిల్డ్ సర్వీసులపై ఎందుకంత నిర్లక్ష్యం? ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించని సర్వీసులను ఎందుకు ఉపేక్షిస్తున్నారు. సెక్షన్ల వారీగా సమీక్షలు నిర్వహించి, వృధా ఖర్చులు, విద్యుత్ లీకేజీలను అరికట్టాల్సిన బాధ్యత అకౌంటెంట్లపైనే ఉంది’అని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు, జెన్కో జేఎండీ శ్రీనివాసరావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు నరసింహ్మారావు, టీఆర్కే రావు, తిరుపతిరెడ్డి, వీఏఓఏటీ అధ్యక్షుడు ఎన్.అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
రివర్షన్లు.. ప్రమోషన్లు.. విద్యుత్ సంస్థల్లో పదోన్నతుల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల్లో సీనియారిటీ జాబితాలు, పదోన్నతుల్లో మార్పులు జరగనున్నాయి. విద్యుత్ సంస్థలు గతంలో ఏపీకి రిలీవ్ చేసిన ఉద్యోగుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్ర విభజనకు ఒకరోజు ముందు అంటే 2014 జూన్ 1 నాటికి ఉన్న సీనియారిటీ జాబితాల ఆధారంగా పదోన్నతులను సవరించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల్లో.. తెలంగాణ ఉద్యోగులు, గతంలో రిలీవ్ చేసి తిరిగి చేర్చుకున్న ఏపీ ఉద్యోగులను కలిపి కొత్త సీనియారిటీ జాబితాను సిద్ధం చేశారు. ఈ అంశంపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం విద్యుత్ సౌధలో సమీక్షించారు. అయితే ఏపీకి రిలీవ్ చేసి తిరిగి చేర్చుకున్న ఉద్యోగుల్లో చాలా మంది సీని యర్లు ఉన్నారని.. వారు కొత్త జాబితాల్లో పైన ఉంటారని తెలంగాణ విద్యుత్ ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. దీనివల్ల ఇప్పటికే ప్రమోషన్ పొందిన తెలంగాణ ఉద్యోగులు తిరిగి పాత హోదాలకు రివర్షనయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పదోన్నతులు కోల్పోయే వారిలో తెలంగాణ ఇంజనీర్లు, అకౌంట్స్, పీఅండ్‌జీ తదితర విభాగాలకు చెందినవారు 150 మందికిపైగా ఉంటారని పేర్కొంటున్నా యి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఇప్పటికే పొందిన పదోన్నతులకు రక్షణ కల్పించేందుకు సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించాలని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం విద్యుత్ మంతిజి.జగదీశ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే సూపర్ న్యూమరరీ పోస్టుల సృష్టికి విద్యుత్ సంస్థలు సుముఖంగా లేనట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇదీ చదవండి: జోహార్ నటశేఖరా! హీరో కృష్ణకు అభిమానుల కన్నీటి వీడ్కోలు -
పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ విద్యుత్ సంస్థల్లో 1999 నుంచి 2004 మధ్య కాలంలో చేరిన ఉద్యోగులకు పాతపెన్షన్, జీపీఎఫ్‌లను అమలు చేయాలని టీఎస్పీఈ జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం ఆ సంఘం ప్రతినిధులు టీఎస్‌పీఈఏ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఐదేళ్ల కాలంలో 4700 మంది సంస్థలో ఉద్యోగులుగా చేరారని, వీరందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేసి ఆదుకోవాలని కోరారు. శుక్రవారం ఇదే అంశం ప్రధాన డిమాండ్‌గా చలో హైదరాబాద్ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశం అనంతరం తెలంగాణ విద్యుత్ సంస్థల చైర్మన్ ప్రభాకర్‌రావు నేతృత్వంలో ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్‌ను కలిసి మరోసారి విజ్ఞప్తి చేయనున్నట్లు జేఏసీ ప్రతినిధులు రత్నాకర్‌రావు, సదానందం, సాయిబాబా, కుమారస్వామి, వెంకటనారాయణ, తదితరులు ఉన్నారు. -
‘కేంద్రం’ నుంచే వివరణ తీసుకోండి!
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలేనని.. రాష్ట్ర విద్యుత్ సంస్థలతో ఈ రెండు సంస్థల మధ్య జరిగిన లావాదేవీలపై అపోహలుంటే వాటి నుంచే వివరణ తీసుకోవాలని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు కోరారు. మంగళవారం ఆయన విద్యుత్‌సౌధలో విలేకరుల సమావేశం నిర్వహించి తెలంగాణ విద్యుత్ సంస్థలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చేసిన ఆరోపణలకు సమాధానాలిచ్చారు. రూ.4.30కు యూనిట్ చొప్పున రాష్ట్రానికి సౌర విద్యుత్ సరఫరా చేసేందుకు ఎన్టీపీసీ ఆసక్తి చూపినా, కొనుగోలు చేయకుండా ఇంతకన్నా అధిక ధరతో ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు చేశాయని చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఎన్టీపీసీ ఆఫర్ చేసిన విద్యుత్ ధరను లక్ష్మణ్ ఒక్కోసారి ఒక్కో విధంగా పేర్కొంటున్నారని, యూనిట్‌కు రూ.4.66 నుంచి రూ.5.19 ధరతో ఎన్టీపీసీ నుంచి 400 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోళ్లకు 2016లో ఒప్పందం చేసుకుని కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. మణుగూరులో భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం నేరుగా బీహెచ్ఈఎల్తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం ఇండియా బుల్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఈ విషయంలో అనుమానాలుంటే ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ నుంచి వివరణ తీసుకోవాలని చెప్పారు. ‘టీఆర్ఎస్ కండువా వేసుకున్నారని లక్ష్మణ్ అనడం ఆవేదన కలిగించింది. టీడీపీ,కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పనిచేశాను. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నాను. ఎప్పు డూ ఏ పార్టీ కండువా వేసుకోలేదు ’అని అన్నారు. 10 వేల ఎం.యూ.ల జలవిద్యుత్ కొరత బహిరంగ టెండర్ల ద్వారానే 2015లో సౌర విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. ‘కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నిర్దేశించిన యూనిట్‌కు రూ.5.79 గరిష్ట ధర పరిమితి లోపే ఈ ఒప్పందాలు జరిగాయి. లక్ష్మణ్ పేర్కొన్న గరిష్ట ధరకు సంబంధించి ఎంఎన్ఆర్ఈ నుంచి మార్గదర్శకాలు రాలేదు. ఈఆర్సీ ఆమోదించిన అంచనాలతో పోల్చితే 4 ఏళ్లలో 10,083 మిలియన్ యూనిట్ల జలవిద్యుత్ లోటు ఏర్పడింది. దీన్ని పూడ్చుకోవడానికి తాత్కాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో అవసరమైన విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించాం. ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్ల ద్వారానే ఈ కొనుగోళ్లు జరిగాయి. హరియాణా మినహా అన్ని రాష్ట్రాల డిస్కంలు నష్టాల్లోనే నడుస్తున్నాయి. ఇక్కడి డిస్కంలే నష్టాల్లో ఉన్నట్లు ఆరోపించడం హాస్యాస్పదం’ అని అన్నారు. -
‘మెగా’ పవర్ ఘనత మనదే!
సాక్షి, హైదరాబాద్: భారతదేశ చరిత్రలో తొలిసారిగా సాగునీటి రంగంలో అత్యధిక మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులను విజయవంతంగా ఉపయోగంలోకి తెచ్చిన ఘనత తెలంగాణ విద్యుత్తు సంస్థలకు దక్కడం ఆనందదాయకమని జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. 124.4 మెగావాట్ల కాళేశ్వరం ప్రాజెక్టు (మేడారం–ప్యాకేజీ– 6) మొదటి పంపు వెట్‌రన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి, అందులో రాష్ట్ర విద్యుత్ సంస్థల శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు నడవడానికి కావాల్సిన విద్యుత్ సౌకర్యం అందించడానికి రెండేళ్లకు పైగా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పని చేసిన విద్యుత్ సిబ్బందిని ప్రభాకర్‌రావు అభినందించారు. కాళేశ్వరంతో పాటు తెలంగాణలోని అన్ని ఎత్తిపోతల పథకాలకు కావాల్సిన విద్యుత్తును ఎలాంటి ఆటంకాలు లేకుండా అందించడానికి పునరంకితమవుతామని తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం ద్వారా కొత్త రికార్డు సృష్టించిన విద్యుత్ సంస్థలు.. ఎత్తిపోతల పథకాలకు రికార్డు స్థాయి ఏర్పాట్లు చేయడం గర్వకారణమన్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ వ్యవసాయాభివృద్ధిలో విద్యుత్ సంస్థలు గణనీయమైన పాత్రను పోషించడం ఆనందదాయకమని వ్యాఖ్యానించారు. విద్యుత్‌శాఖ రికార్డుస్థాయి ఏర్పాట్లు... భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలం గాణ విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేయడానికి రికార్డు స్థాయి ఏర్పాట్లు చేశాయి. ప్రాజెక్టును విజయవంతం గా నిర్వహించడంలో విద్యుత్ శాఖకున్న ప్రాధా న్యాన్ని మొదట్లోనే గుర్తించిన కేసీఆర్.. దీనికి అనుగుణంగా విద్యుత్ అధికారులను అప్రమత్తం చేశారు. విద్యుత్ శాఖ చరిత్రలోనే మొదటి సారిగా ట్రాన్స్‌కోలో ఎత్తిపోతల పథకాలకు ప్రత్యేక డైరెక్టర్ (సూర్య ప్రకాశ్)ను నియమించారు. ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో విద్యుత్, నీటిపారుదల శాఖ అధికారులు ప్రతీ వారం క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వ హించారు. ఆస్ట్రియా తదితర దేశాలు పర్యటించి పంపుల సామర్థ్యాన్ని మదింపు చేశారు. బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసు కుని వివిధ ప్లాంట్లలో సమాంతరంగా ప్రత్యేక పంపులను తయారు చేయించారు. రూ.2,890 కోట్ల వ్యయంతో 5వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయడానికి కావాల్సిన ఏర్పాట్లను నిర్ణీత గడువులో పూర్తి చేశారు. మొత్తం 15 పంపుహౌజుల వద్ద 15 డెడికేటెడ్ సబ్స్టేషన్లు నిర్మించారు. వివిధ కేటగిరీల్లో 80 పంపులు బిగించా రు. గతంలో కేవలం 30 మెగావాట్ల విద్యుత్ పంపు లు వాడిన చరిత్ర మాత్రమే తెలంగాణలో ఉంది. కానీ చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ విద్యుత్ సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో 139 మెగావాట్ల పం పులు (ప్యాకేజీ 8 – రామగుడు) ఉపయోగిస్తున్నారు. భారత్‌లో ఇంత భారీ సామర్థ్యంతో ఎక్కడా ఎవరూ పంపులు వాడలేదు. సముద్రమట్టానికి 550 మీటర్లకు పైగా ఎత్తుకు నీటిని పంపింగ్ చేసి, తెలంగాణ బీళ్లకు నీటిని మళ్లించే బృహత్ కార్యానికి విద్యుత్ సంస్థలు ఇరుసుగా పనిచేస్తున్నాయి. -
‘సీమాంధ్ర ఉద్యోగుల కుట్రలను తిప్పికొడతాం’
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థకు మరోమారు అన్యాయం జరగకుండా మా ఉద్యోగాలు మేము కాపాడుకుంటామని, ఇక్కడినుంచి రిలీవ్ అయినా ఇక్కడే ఉండేందుకు చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల కుట్రలను తిప్పికొడతామని టీఎస్పీడీసీఎల్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ తెలిపింది. శుక్రవారం మింట్ కంపౌండ్‌లోని టీఎస్పీడీసీఎల్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్పొరేట్ కార్యాలయంలో సామూహిక నిరాహారదీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల కుట్రలు తెలంగాణ విద్యుత్ సంస్థ పురోగతికి అడ్డంగా మారుతున్నాయన్నారు. ఏపీకి వెళ్తామని ధర్నాలు చేస్తూనే మరోవైపు ఏపీ మేనేజ్మెంట్తో కలసి మాపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగులను ఏపీకి పంపేందుకు చేస్తున్న ఈ పోరా టంలో తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా టీఎస్పీడీసీఎల్ సీఎండీకి, ఎస్పీడీసీఎల్ హెచ్ఆర్కు వినతిపత్రాన్ని అందజేశారు. -
విద్యుత్ ఉద్యోగుల వివాదం మళ్లీ మొదటికి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి స్థానికత ఆధారంగా ఏపీకి రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగుల వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ఈ వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు తెలంగాణ, ఏపీ విద్యుత్ సంస్థల అధికారులు శనివారం జరిపిన మూడో దఫా చర్చలు విఫలమయ్యాయి. పరస్పర విరుద్ధ వాదనలు, అభిప్రాయాలు వ్యక్తంకావడంతో... ఇకపై చర్చలు వద్దని, న్యాయస్థానంలోనే తేల్చుకుందామని ఇరుపక్షాలు నిర్ణయించాయి. ఈ వివాదంపై ఫిబ్రవరి 1న హైకోర్టులో జరగనున్న విచారణకు సన్నద్ధమవుతున్నాయి. కొన్ని అంశాలపైనే ఏకాభిప్రాయం పుట్టిన ప్రాంతం ఆధారంగా స్థానికతను నిర్ధారిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో జన్మించిన 1,252 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు గత జూన్‌లో ఏపీకి రిలీవ్ చేసిన విషయం తెలిసిందే. అయితే శనివారం జరి గిన చర్చల్లో తెలంగాణ విద్యుత్ సంస్థలు కొంత వెనక్కితగ్గాయి. పుట్టిన ప్రాంతానికి బదులు ఆర్టికల్ 371డి ఆధారంగా ఉద్యోగుల స్థానికతను నిర్ణయించి విభజన జరిపేందుకు అంగీకరించాయి. అంటే 1 నుంచి 7వ తరగతి వరకు విద్యను ఏ రాష్ట్రంలో అభ్యసిస్తే సదరు ఉద్యోగులు ఆ రాష్ట్రానికి చెందినవారు అవుతారు. ఆ లెక్కన రిలీవైన ఉద్యోగుల్లో దాదాపు 200 మంది వరకు తిరిగి తెలంగాణకు వచ్చేందుకు మార్గం ఏర్పడింది. అదేవిధంగా జనాభా దామాషా ప్రకారం ఏపీ, తెలంగాణల మధ్య 58:42 నిష్పత్తిలో పోస్టుల సంఖ్యను, కేడర్‌తో సంబంధం లేకుండా ఉద్యోగులందరినీ విభజించుకుందామని ఏపీ అధికారులకు తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ప్రతిపాదించారు. దాంతోపాటు జీవిత భాగస్వామి ఏ రాష్ట్రంలో పనిచేస్తే అదే రాష్ట్రానికి ఉద్యోగుల కేటాయింపుతో పాటు అనారోగ్యం, వైకల్యం కారణాలతో సడలింపులు ఇచ్చేందుకూ అంగీకరించారు. కానీ జనాభా దామాషా ప్రకారం కేడర్ టు కేడర్ ఉద్యోగుల విభజన జరగాలని ఏపీ ట్రాన్స్‌కో ఎండీ విజయానంద్ కోరారు. లేకుంటే ఏపీకి సీనియర్ అధికారులు ఎక్కువ మంది వచ్చేస్తారని, అది తమకు భారంగా మారుతుందని వాదించారు. దీనికి తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ఒప్పుకోక పోవడంతో చర్చలు విఫలమయ్యాయి. -
తెలంగాణ సరే అంటోంది.. మీ సంగతేంటి?
- ఏపీ సర్కార్‌ను ప్రశ్నిస్తున్న విద్యుత్తు ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన ఏపీ స్థానికత గల విద్యుత్ ఉద్యోగుల వ్యవహారం ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కోర్టులోకి మళ్లింది. ఉద్యోగుల బృందం తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును కలిశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. జీతాల చెల్లింపు విషయంలో ఏపీ ప్రభుత్వం అంగీకరిస్తే, తాము స్పందిస్తామని ఆయన చెప్పినట్టు ఉద్యోగులు తెలిపారు. న్యాయస్థానం ఉత్తర్వుల్లో 58 శాతం వేతనాలు ఆంధ్రప్రదేశ్, 42 శాతం తెలంగాణ చెల్లించాలన్న అంశాన్ని ఆయన గుర్తుచేశారని, ఏపీ సర్కారు నుంచి ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇస్తే, తమకు అభ్యంతరం ఉండబోదని చెప్పినట్టు సమాచారం.దీంతో ‘తెలంగాణ ఒప్పుకుంది కదా? మీరు కూడా సరే అనండి’ అని ఉద్యోగులు ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్‌ను నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్టు సమాచారం. అయితే తాను నిర్ణయం తీసుకోలేనని, ప్రభుత్వమే ఇందుకు మొగ్గు చూపడం లేదని ఆయన సూచన ప్రాయంగా చెప్పినట్టు తెలిసింది. తెలంగాణలో పనిచేస్తున్న వారికి తామెలా వేతనాలు ఇస్తామని, అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్దామని సీఎం వ్యాఖ్యానించినట్లుగా సీఎండీ వివరించారని తెలిసింది.