హన్మకొండ : సీమాంధ్ర ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ల జేఏసీ ఎన్పీడీసీఎల్ కంపెనీ పరిధి కన్వీనర్ బి.సామ్యానాయక్ హెచ్చరించారు. సీమాంధ్ర ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవద్దని, వారిని ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి పంపాలనే డిమాండ్‌తో తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హన్మకొండలోని విద్యుత్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ధర్నాలో సామ్యానాయక్ మాట్లాడుతూ సీమాధ్ర ఉద్యోగులు ఇక్కడ విధుల్లో చేరితే ఎలా అడ్డుకోవాలో తెలుసునన్నారు. ధర్నాలో ఎన్పీడీసీఎల్ సీఈలు సదర్‌లాల్, వేణుగోపాలచారి, మోహన్‌రావు, రామకృష్ణ, అశోక్‌కుమార్, ఎస్‌ఈలు మధుసూదన్, రాజేష్‌చౌహాన్, నారాయణ, ఇంజనీర్ల జేఏసీ నా యకులు సుభ్రమణ్యేశ్వర్‌రావు, తిరుమల్‌రావు, మల్లయ్య, రణధీర్‌రెడ్డి, బి. కిశోర్, సురేష్, ప్రభావతి, జమున, రాంబాబు, కిరణ్ పాల్గొన్నారు.
మరో ఉద్యమం చేపడుతాం..
Published Wed, Apr 27 2016 2:12 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM
Advertisement