కేరళనుంచి సాక్షి ప్రతినిధి: స్థానిక పరిపాలన, పంచాయతీరాజ్ వ్యవస్థల తీరుతెన్నులను అధ్యయనం చేసేందుకు తెలంగాణ నుంచి పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు ఆది వారం కేరళకి వచ్చారు. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన షెడ్యూల్ మేరకు వందమంది జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు త్రిసూర్ సమీపంలోని కేరళ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్(కిలా)కు చేరుకున్నారు. కేరళలో స్థానిక ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధివిధానాలపై అక్కడి గ్రామీణాభివృద్ధి విభాగం నిపుణులు వీరికి వివరిస్తారని, ప్రజాప్రతినిధులు కొన్ని గ్రామాలను పరిశీలిస్తారని తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు.