టిఆర్ఎస్ సిద్దాంతకర్త ఆచార్య జయశంకర్ 79వ జయంతి సందర్భంగా తెలంగాణ వాదులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు
హైదరాబాద్ : టిఆర్ఎస్ సిద్దాంతకర్త ఆచార్య జయశంకర్ 79 వ జయంతి సందర్భంగా తెలంగాణ వాదులు ఆయనకు మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణవాదులు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శాంతి కపోతాన్ని ఎగురవేశారు.
తెలంగాణ పొలిటికల్ జెఏసి నేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, శ్రీనివాసగౌడ్, దేవిప్రసాద్తో పాటు వివిధ తెలంగాణ సఃఘాలకు చెందిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాన ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ పాత్రను, ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది నవ తెంగాన రాష్ట్రం ఏర్పాటయ్యే వరకూ పోరాటం కొనసాగిస్తామని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రతిపాదించినట్టు 10 ఏళ్లు మైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అవసరంలేదని తాత్కాలిక రాజధానిగా హైదరాబాద్ ను ప్రకటించాలని మల్లేపట్టి లక్ష్మయ్య డిమాండ్ చేశారు.
తెలంగాణ ఏర్పాటయ్యాక సీమాంధ్రులకు ఎటువంటి భయాందోళన అవసరంల లేదని, కొందరు పెట్టుబడి దారులు సీమాంధ్ర ప్రజలు ఉద్యోగులతో కృత్రిమ ఉద్యమం నడిపిస్తున్నారని వారి కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని శ్రీనివాసగౌడ్ తెలిపారు. హైదరాబాద్లో సమైక్యవాదులు ఆందోళనలు చేస్తే సహించమని భవిష్యత్ లో తెలంగాన ఏర్పాడ్డాక అలాంటి వారు ఇబ్బందులు పడక తప్పదని ఆయన హెచ్చరించారు.