విజయమ్మ పర్యటనను అడ్డుకోవడం అప్రజాస్వామికం
Published Fri, Nov 1 2013 3:31 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట), న్యూస్‌లైన్ :తుపాను, వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించి, ధైర్యం చెప్పేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేస్తున్న పర్యటనను తెలంగాణకు చెందిన నాయకులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, తాజా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానిఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక పక్క అన్నదమ్ముల్లా విడిపోదామంటూ, సీమాంధ్రులను సోదరుల్లా ఆదరిస్తామని ప్రకటనలు చేస్తున్న తెలంగాణ నాయకులు, రాష్ట్ర విభజన జరగకుండానే ఇటువంటి దుశ్చర్యలకు పా ల్పడటం దారుణమన్నారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణవాదుల ఆగడాలకు అంతు ఉండదని ఆందోళన వ్యక్తం చే శారు.
తెలంగాణవాదులు రైతులను ఆదుకోకపోగా, ఆదుకోవడానికి వచ్చి న వారిని అడ్డుకోవడం చూస్తుంటే ఆ ప్రాంత ప్రజలపై వారికున్న మమకారం, చిత్తశుద్ధి అవగతం అవుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా తెలంగాణ నాయకుల రాజకీయ దురుద్దేశా న్ని ప్రజలు గ్రహించాలన్నారు. రాజకీ యాల కోసం ప్రజలను బలి చేయడానికి ప్రయత్నిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఆందోళనను ఉధృతం చేస్తామని, తెలంగాణ నాయకులకు ఆ ప్రాంత ప్రజలే బుద్ధి చెప్పేలా చైతన్యవంతుల్ని చేస్తామన్నారు.
మానవతా ధృక్పథంతో పర్యటనకు వెళ్లిన విజయ మ్మను అడ్డుకున్న వారిని అదుపు చేయాల్సిందిపోయి తమ పార్టీ నేతలను అరెస్ట్ చేయించడం రాష్ట్ర ప్రభుత్వ కుటిల నీతిని బయటపెడుతోందని దు య్యబట్టారు. విజయమ్మకు తెలంగాణ ప్రజలు పలికిన స్వాగతం, ఆమెపై వారు చూపిన ఆదరణను చూసి అక్కడి నాయకులకు అభద్రతాభావం పెరిగి పోయిందన్నారు. అందుకే వారు ప్రజ లను రెచ్చగొట్టడానికి విఫలయత్నం చే స్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ నాయకుల పర్యటనలు కొనసాగుతాయని, ఈసా రి వారిని అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. విజయమ్మను అడ్డుకోవడాన్ని ఆ ప్రాంత ప్రజలే తీవ్రంగా వ్యతిరేకించడం చూస్తుంటే ఆమెకు అక్కడి ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాజకీయాలు మా ని నష్టపోయిన వారిని ఆదుకోవడంపై తెలంగాణ నాయకులు దృష్టి సారించాలని బాలరాజు, నాని హితవు పలికారు.
Advertisement
Advertisement