
ఆరు కోట్ల మంది ఆంధ్రుల్ని అవమానించారు.. యావత్ ఆంధ్రప్రదేశ్‌ను అవమానించారు. భావి తరాలకు ఏం సమాధానం చెబుతారు?.
తిరుపతి, సాక్షి: కూటమి ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించకపోవడంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆమె ఒక సందేశం ఉంచారు.
‘‘మన చుట్టూ ఉన్న.. తెలంగాణకు అవతరణ దినం ఉంది. కర్నాటకకు అవతరణ దినం ఉంది. తమిళనాడుకు అవతరణ దినం ఉంది. ఒడిశాకు అవతరణ దినం ఉంది. కానీ, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం వలనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి అవతరణ దినోత్సవం అంటూ లేకుండా పోయింది.
ఇదీ చదవండి: అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం: వైఎస్ జగన్
‘‘మా జగనన్న ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించాం. అయితే చంద్రబాబు ప్రభుత్వం జిల్లా స్థాయిలో కూడా అవతరణ దినోత్సవరం నిర్వహణ రద్దు చేసింది. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని అవహేళన చేసేలా ఈ నిర్ణయం ఉంది అని ఆర్కే రోజా అన్నారు.
ఆరుకోట్ల ఆంధ్రులను అవమానించారు..
ఆంధ్రప్రదేశ్ ను అవమానించారు..
మన చుట్టూ ఉన్న...
తెలంగాణకు అవతరణ దినం ఉంది
కర్నాటకకు అవతరణ దినం ఉంది
తమిళనాడుకు అవతరణ దినం ఉంది
ఒడిశా కు అవతరణ దినం ఉంది
కానీ @ncbn ముఖ్యమంత్రి అవ్వడం వలన...
ఆంధ్రప్రదేశ్ కి అవతరణ దినం...లేకుండా పోయింది...…— Roja Selvamani (@RojaSelvamaniRK) November 1, 2024
.. ఎంత దారుణం.. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించరా?. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? చంద్రబాబు, పవన్ కల్యాణ్.. వీళ్లసలు పాలకులేనా?. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అవతరించిందని అడిగితే.. భావితరాలకు ఏం సమాధానం చెప్తారు..?. ఆరు కోట్ల మంది తెలుగు ప్రజలను అవమానించినందుకు.. అమరజీవి త్యాగాన్ని అవమానించినందుకు.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇక నుంచి ప్రతీ ఏటా అవతరణ దినోత్సవం తప్పక నిర్వహించాల్సిందే’’ అని ఆమె డిమాండ్ చేశారామె.
Comments
Please login to add a commentAdd a comment