అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఏకపక్షంగా ఎలా నిర్ణయిస్తారని రఘువీరా ప్రశ్నించారు. వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలు, మేథావుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే దీనిపై ముందుకు వెళ్లాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం జూన్ 2వ తేదీన నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని రఘువీరా తప్పుబట్టారు. తక్షణమే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలన్నారు.