రాజ్‌భవన్ : ఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ర్ట ప్రజలకు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. క్షేత్రస్థాయిలో అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేదలకు అవసరమైన సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని అభినందించారు. ప్రజలే ప్రాధాన్యతగా ప్రభుత్యం అమలు చేస్తున్న విధానాలను కొనసాగించాలన్నారు. పారదర్శకత, సుపరిపాలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగాలని, సామాన్యుల కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావాలని గవర్నర్ పేర్కొన్నారు. (సీఎం జగన్ వ్యక్తి కాదు.. వ్యవస్థ )
Comments
Please login to add a commentAdd a comment