సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, భారతి దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. గురువారం సాయంత్రం రాజ్ భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, ఇతర అధికారులు స్వాగతం పలికారు.
గవర్నర్, సీఎంల మధ్య దాదాపు గంటకు పైగా జరిగిన భేటీలో విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై లోతుగా సమాలోచించారు. కొత్త జిల్లాల వ్యవస్ధతో పాలన ప్రజలకు మరింత చేరువయ్యిందని సీఎం గవర్నర్‌కు వివరించారు. నూతన జిల్లాలలో కార్యాలయాలు అన్ని ఒకే ప్రాంగణంలో ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
చదవండి: (పరిమితి, కాలపరిమితి లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు: సజ్జల)
తొలుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను ముఖ్యమంత్రి దంపతులు జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త, శాసన మండలి సభ్యుడు తలశిల రఘురామ్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ముత్యాలరాజు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతీ రాణా టాటా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: (పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ.. సంచలన విషయాలు వెలుగులోకి)
Comments
Please login to add a commentAdd a comment