హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం వేడుకలకు తెలంగాణ మంత్రులు దూరంగా ఉన్నారు. దాంతో తెలంగాణ జిల్లాల్లో మంత్రులకు బదులు కలెక్టర్లే జెండా ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం సందర్భంగా నవంబర్ 1న తెలంగాణవ్యాప్తంగా విద్రోహదినాన్ని పాటించాలని టీ జేఏసీ పిలుపునిచ్చింది.
తెలంగాణలోని గ్రామస్థాయి వరకు నిరసనర్యాలీలు నిర్వహించాలని సూచించింది. ఇక ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు.