వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రావతరణ వేడుకలు | YSRCP Celebrates Andhra Pradesh formation day | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రావతరణ వేడుకలు

Nov 1 2014 10:09 AM | Updated on May 29 2018 4:15 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోంది.

కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో రాష్ట్రావతరణ వేడుకలు జరిగాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి, పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మణిగాంధీ, ఎస్వీ మోహన్ రెడ్డి, గౌరు చరిత తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో రాష్ట్ర అవతరణ వేడుకలను వైఎస్ఆర్ సీపీ జరుపుతుందని తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు జూన్ 2న నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement