
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని, ఏజెన్సీ ప్రాంతంలో మౌలిక వసతులను కల్పిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా అక్టోబర్2న విశాఖపట్నం జిల్లాలోని పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తున్నామని పేర్కొన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని విజయసాయిరెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు. చదవండి: ( భారానికి, అధికారానికి తేడా వాళ్ళకు తెలియదా?)
Comments
Please login to add a commentAdd a comment