
సాక్షి, విశాఖపట్నం: గంగవరంలో పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు ఇస్తామని, కాలుష్యంతో ఇబ్బంది ఉన్న గంగవరం చుట్టుపక్కల గ్రామాలను మరోచోటికి తరలిస్తామని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గంగవరం గ్రామంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగవరం పోర్టులో ఉన్న ఉద్యోగులతో సమానంగా స్థానికులకు జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వ్యతిరేకమని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలని ప్రధాని మోదీకి ఇప్పటికే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారని గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్‌కు భూములు ఇచ్చి ఉద్యోగం రానివారికి ఉద్యోగాలు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైస్సార్‌సీపీ జెండా ఎగరాలన్నారు. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు గెలిస్తే నగరం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment