టీఆర్‌ఎస్ భవన్ ముట్టడికి యత్నం
Published Fri, Dec 11 2015 1:57 PM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM
హైదరాబాద్: మాలమహానాడు కార్యకర్తలు శుక్రవారం టీఆర్‌ఎస్ భవన్ ముట్టడికి యత్నించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే, బంజారాహిల్స్ పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ... గ్రేటర్ ఎన్నికల్లో మాలల తడాఖా ఏంటో టీఆర్‌ఎస్‌కు రుచి చూపిస్తామన్నారు. మాల, మాదిగల మద్య చిచ్చుపెట్టి గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తే టీఆర్‌ఎస్‌కు పుట్టగతులుండవని మండిపడ్డారు.
Advertisement
Advertisement