trs bhavan
-
ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణం ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో టీఆర్ఎస్ భవన నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్రావుతో పాటు ఎండీపీ ఇన్ఫ్రా నిర్మాణ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. భవన నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల అనుమతులు ఇప్పటికే తీసుకున్నట్లు మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. -
టీఆర్ఎస్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
సాక్షి, న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల చరిత్ర కలిగిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, ఢిల్లీలో కార్యాలయాన్ని నిర్మించుకొని దేశ రాజకీయాల్లో ముద్ర వేసేందుకు సిద్ధమైంది. టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచే ఈ భవన నిర్మాణానికి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. సీఎంతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భూమి పూజ నిర్వహించారు. మధ్యాహ్నం 1:48 గంటలకు పునాదిరాయి వేశారు. వసంత్ విహార్‌లో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. వచ్చే ఏడాది దసరాలోగా పూర్తి నిర్మాణ స్థలంలో వేద పండితులు గురువారం ఉదయం 11 గంటల నుంచే శాస్త్రోక్తంగా పూజలు ప్రారంభించారు. మధ్యాహ్నం 1:14 గంటలసమయంలో సీఎం అక్కడికి చేరుకున్నారు. భూమిపూజకు ముందు జరిగిన హోమంలో కేసీఆర్, కేటీఆర్‌లు పాల్గొన్నారు. 2022 దసరాలోగా 1,100 చదరపు మీటర్ల స్థలంలో భవన నిర్మాణాన్ని çపూర్తిచేయాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేíసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భవన నిర్మాణం పూర్తయిన తర్వాత, దేశ రాజధానిలో సొంత కార్యాలయ భవనం నిర్మించుకున్న అతికొద్ది ప్రాంతీయ పార్టీల జాబితాలో టీఆర్ఎస్ చేరనుంది. ఉత్కంఠ .. ఉత్సాహం .. ఉద్వేగం ఢిల్లీలో గత మూడురోజులుగా భారీ వర్షాలు కురవడంతో భూమిపూజ కార్యక్రమం ఎలా జరుగుతుందోనన్న ఉత్కంఠ మంత్రులు, పార్టీ శ్రేణుల్లో నెలకొంది. అయితే పూజా కార్యక్రమం మొదలయ్యే సమయానికి వర్షం తగ్గిపోవడంతో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా అక్కడికి చేరుకున్నారు. కానీ ఢిల్లీ పోలీసుల భారీ బందోబస్తు నేపథ్యంలో కేవలం ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులను మాత్రమే ప్రాంగణంలోకి అనుమతించారు. కేసీఆర్, కేటీఆర్‌లు వచ్చిన సమయంలో కొందరు నేతలు, కార్యకర్తలు బారికేడ్లు తోసుకొని ప్రాంగణంలోనికి వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు నియంత్రించారు. భూమిపూజ సమీప ప్రాంతానికి వెళ్లలేకపోవడంతో వారు ఉద్వేగానికి గురయ్యారు. హాజరుకాని హరీశ్, కొప్పుల, తలసాని సుమారు మూడు గంటలపాటు ఈ కార్యక్రమం కొనసాగింది. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మహమూద్ అలీ, జగదీశ్వర్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ పాల్గొన్నారు. ఎంపీలు కె.కేశవరావు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సంతోష్‌కుమార్, బండ ప్రకాశ్, కేఆర్ సురేశ్‌రెడ్డి, లింగయ్య యాదవ్, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాలోత్ కవిత, దయాకర్, వెంకటేశ్ నేత, రాములు హాజరయ్యారు. వీరితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిదులు, పార్టీ నాయకులు ఎల్.రమణ, తుమ్మల నాగేశ్వరరావు, మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు హాజరుకాలేదు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్లీలు, బ్యానర్లతో ఇండియాగేట్ సమీపంలోని తెలంగాణ భవన్, వసంత్‌విహార్, సీఎం అధికారిక నివాసం ఉన్న తుగ్లక్‌రోడ్డు సహా పలు ప్రాంతాలు గులాబీ మయం అయ్యాయి. పార్టీ శ్రేణులకు గర్వకారణం: కేటీఆర్ రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంటూ, చిక్కుముళ్లని విప్పుకుంటూ, తెలంగాణ గల్లీలో ఉద్యమాన్ని సజీవంగా ఉంచుతూనే అటు ఢిల్లీ పవర్ కారిడార్లలో లాబీయింగ్ ద్వారా తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ విస్తృతంగా మద్దతు కూడగట్టారని కేటీఆర్ గుర్తుచేశారు. దక్షిణ భారతదేశానికి సంబంధించి ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేస్తున్న తొలి ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ కావడం పార్టీ శ్రేణులకు గర్వకారణమని పేర్కొన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న ప్రొఫెసర్ జయశంకర్ మాటలను ఉటంకించారు. రెండు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చరిత్రతో పాటు రాష్ట్ర పునర్నిర్మాణ ప్రయాణాన్ని ప్రస్తావించారు. తన తొలి అడుగే త్యాగంతో మొదలు పెట్టిన కేసీఆర్, ఢిల్లీ మెడలు వంచి ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చారని చెప్పారు. గత ఏడేళ్లుగా రాష్ట్రంలో తెలంగాణ భాష, సంస్కృతులకు పెద్దపీట వేస్తూ ఒక మహత్తరమైన పునర్నిర్మాణ ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతున్నదని అన్నారు. తెలంగాణ సాధన, పునర్నిర్మాణం అనే రెండు చారిత్రక కర్తవ్యాలను విజయవంతంగా నెరవేర్చిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దేశ రాజధానిలో ఒక గొప్ప కార్యాలయం నిర్మించుకునేందుకు పూనుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా, తెలంగాణ నుంచి వచ్చిన వందలాది మంది నాయకులు, కార్యకర్తల నడుమ ఈ కార్యక్రమం ఒక పండుగలా జరిగిందని కేటీఆర్ తెలిపారు. ఎంతో ఆనందంగా ఉంది: మంత్రి వేముల ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు భూమిపూజ చేయడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీ గడ్డపై గులాబీ జెండాను ఎగురవేయడం మరిచిపోలేని విషయమన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ప్రభుత్వ పనితీరును దేశం నలుమూలల తెలియజేయాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీపై ఉందని తెలిపారు. ఈ బాధ్యత నిర్వర్తించేందుకు ఢిల్లీలో నిర్మించబోయే తెలంగాణ భవన్ ఒక వేదిక కానుందని మంత్రి పేర్కొన్నారు. ఇదొక చారిత్రక సన్నివేశం తెలంగాణ గులాబీ పతాకం ఢిల్లీ గడ్డపై రెపరెపలాడటం ప్రతి తెలంగాణ బిడ్డకు ఒక గొప్ప భరోసాను ఇస్తుంది. దేశ రాజధానిలో పార్టీ కార్యాలయానికి భూమిపూజ ఒక చారి త్రక సన్నివేశం. తెలంగాణ ఉద్యమ చరిత్రతో పాటు టీఆర్ఎస్ పార్టీ కూడా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. – కేటీఆర్ -
రేవంత్‌ను నమ్మడం కరెక్టేనా?: మంత్రి ప్రశాంత్ రెడ్డి
-
తరలివచ్చిన టీఆర్ఎస్ యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం జరిగిన టీఆర్ఎస్ సమావేశంతో తెలంగాణ భవన్ పరిసరాలు సందడిగా మారాయి. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుమారు 220 మందికిపైగా కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, సాయన్న, లక్ష్మారెడ్డి, చెన్నమనేని రమేశ్ వివిధ కారణాలతో ఈ భేటీకి హాజరుకాలేదు. శనివారం మధ్యాహ్నం 12.30కు తెలంగాణ భవన్‌కు చేరుకున్న పార్టీ అధినేత... సుమారు గంటన్నరపాటు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ మినహా ఇతర నేతలెవరూ ప్రసంగించలేదు. ఉమ్మడి జిల్లాలవారీగా భేటీలు... ఉమ్మడి జిల్లాలవారీగా సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ ఎన్నికల పార్టీ ఇన్చార్జీలు, జడ్పీ చైర్మన్లు వేర్వేరుగా భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపు, ప్రచార షెడ్యూల్, సమన్వయం తదితరాలపై చర్చించారు. ఒకట్రెండు జిల్లాలు మినహా మిగతా జిల్లాల నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి పోటీ లో ఉండే అభ్యర్థులెవరైనా పార్టీ జెండాలు, పార్టీ నేతల ఫొటోలను ఉపయోగిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని కేటీఆర్ ఆదేశించారు. 25న తెలంగాణ భవన్‌కు ఎమ్మెల్సీలు... ఈ నెల 25న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని టీఆర్ఎస్ ఆదేశించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉండే అవకాశం ఉన్నందున, కో–ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక తదితరాలకు సంబంధించి పార్టీ అధిష్టానానికి సహకరించేందుకు తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎన్నికల బాధ్యత లేనందున అవసరమైన చోట ప్రచారానికి వెళ్లాల్సిందిగా సూచించారు. మల్లారెడ్డితో గొడవపై ఆరా తీసిన కేసీఆర్ మంత్రి మల్లారెడ్డితో శుక్రవారం చోటుచేసుకున్న గొడ వకు దారితీసిన పరిస్థితులపై మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని కేసీఆర్ ఆరా తీసినట్లు తెలిసింది. పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిశాక కేసీఆర్‌ను కలసిన సుధీర్‌రెడ్డి నియోజకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన వర్గం నాయకులను దూరం పెడుతూ మల్లారెడ్డి ఇష్టానుసారంగా టికెట్ల కేటాయింపు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను విస్మరించడంతోపాటు జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో పెరిగిపోతున్న భూకబ్జాల పర్వంపైనా సుధీర్‌రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కాగా, సమావేశం పూర్తయ్యాక తన విద్యాసంస్థల ఆవరణలో నిర్వ హిస్తున్న పూజా కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం కేసీఆర్‌ను మంత్రి మల్లారెడ్డి ఆహ్వానించగా తన తరఫున పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావును పంపినట్లు తెలిసింది. -
ప్రధానిని కలసిన టీఆర్ఎస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీలు సోమవారం పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పార్టీ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, సంతోష్, బూర నరసయ్యగౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సీతారాం నాయక్, జి.నగేశ్, బీబీ పాటిల్, బి.లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు సమావేశమై ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణానికి స్థలం కేటా యింపుపై వినతిపత్రాన్ని ఇచ్చారు. పార్లమెంటు లో టీఆర్ఎస్కు ఉన్న 17 మంది సంఖ్యా బలం ఆధారంగా పట్టణాభివృద్ధి శాఖ నిబంధనల మేరకు తమకు వెయ్యి చదరపు గజాల స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ఆర్పీ రోడ్డులో స్థలాన్ని కేటాయించాలని ప్రధానిని కోరారు. ముందుగా ఢిల్లీలోని సాకేత్, వసంత్ విహార్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ ప్రాం త్రాలను టీఆర్ఎస్ ఎంపీలు పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం పరిశీలించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకొని వెళ్లే ముందు సీఎం కేసీఆర్ కూడా ఆయా ప్రాంతాల మ్యాపులను పరిశీలించి తెలంగాణ భవన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చివరికి అన్ని అనుకూలతలను పరిశీలించిన అనంతరం రాజేంద్ర ప్రసాద్ రోడ్ ను ఎంపిక చేసుకున్నారు. నాకు ఒక్క స్వీటు కూడా ఇవ్వలేదు.. తనను కలసిన టీఆర్ఎస్ ఎంపీలతో ప్రధాని మోదీ సరదా సంభాషణ సాగించారు. తెలం గాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజా రిటీతో గెలిచినా తనకు ఒక్క స్వీటు తినిపించలేదన్నారు. మంత్రులు, ఎంపీలకు స్వీట్లు తినిపిం చి నాకు మాత్రం ఇవ్వరా? అని మోదీ సరదాగా అన్నట్టు తెలిసింది. దీనికి స్పందించిన టీఆర్ఎస్ ఎంపీలు.. పుల్లారెడ్డి స్వీట్స్ నుంచి ప్రత్యేకంగా బెల్లం, కాజుతో చేసిన స్వీట్లు స్వయంగా తీసుకొచ్చి ఇస్తామని చెప్పారు. -
‘అందుకే 2014లో ఒంటరిగా పోటీ చేశాం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ అవమానించడం వల్లే 2014లో తాము ఒంటరిగా బరిలోకి దిగామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. బుధవారం మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో కేసీఆర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి వివరించాను. రాష్ట్రంలో నాయకత్వ లోపం ఉండటంతో.. ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించే పరిస్థితి లేదని తెలిపాను. ఆమె దిగ్విజయ్ సింగ్‌తో మాట్లాడమని చెప్పారు. కానీ దిగ్విజయ్ సింగ్ అవమానించారు. అయినా రెండు రోజులు ఓపిక పట్టాను. కానీ ఈ లోపే మా పార్టీకి చెందిన విజయశాంతితో పాటు మరికొందరు నాయకులను కాంగ్రెస్ వారి పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. దీంతో ఇక ఒంటరిగానే పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్నాను. 2014లో మేము ఉత్తర తెలంగాణను నమ్ముకున్నాం. ఆ ఎన్నికల్లో 44 సీట్లు మాకు అక్కడే వచ్చాయ’ని తెలిపారు. అసెంబ్లీ రద్దయిన తర్వాత అధికారులతో మాట్లాడలేదు అమ్మ తోడు అసెంబ్లీ రద్దయిన తరువాత తను ఏ జిల్లా ఎస్సీతోగానీ, కలెక్టర్తోగానీ మాట్లాడలేదని కేసీఆర్ వెల్లడించారు. సీఎంఓ అధికారులతో కూడా తను మాట్లాడలేదని స్పష్టం చేశారు. కేవలం మిషన్ భగీరథ పనుల గరించి మాత్రమే తను వారితో మాట్లాడినట్టు తెలిపారు. -
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు!
-
సెప్టెంబర్ మొదటి వారం అత్యంత కీలకం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ రద్దు అనేది ఎప్పుడు ఉంటుందనేది త్వరలోనే చెబుతానని తెలిపారు. ఎన్నికలు ఏ క్షణమైనా రావొచ్చు..సిద్ధంగా ఉండండని పార్టీ నాయకులకు, శ్రేణులకు సూచించారు. హైదరాబాద్ సహా తెలంగాణ అంతా టీఆర్ఎస్ గాలి వీస్తోంది..మీరు ప్రజల్లోకి వెళ్లండి..ప్రభుత్వం చేసింది చెప్పండని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభలో ఎన్నికల శంఖారావం మోగిస్తామని వెల్లడించారు. ఆ సభకు 25 లక్షలకు పైగా జన సమీకరణ జరగాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇతర రాజకీయ పార్టీలకు దడ పుట్టేలా సభ జరగాలని అన్నారు. సెప్టెంబర్‌లోనే టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు. టీఆర్ఎస్ భవన్లో ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలు దేరి వెళ్లనున్నారు. రేపు ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. సెప్టెంబర్ మొదటి వారం అత్యంత కీలకం 100 నియోజకవర్గాల్లో 50 రోజుల పాటు కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. అసెంబ్లీ రద్దుపై న్యాయ నిపుణులతో ఆయన చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ మొదటి వారం అత్యంత కీలకం కాబోతోంది. కాగా, సిట్టింగ్ ఎమ్మెల్లో ఐదారుగురు తప్ప మిగతా వారు బాగానే పనిచేస్తున్నారని సమావేశంలో కేసీఆర్ వెల్లడించారు. ఆ ఐదారుగురు కూడా ప్రజల మధ్య ఉంటే ఇబ్బంది ఉండదని, వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయం తనకు వదిలేయాలని అన్నారు. -
తెలంగాణలో ఎన్నికలు ఏ క్షణమైనా రావొచ్చు..
-
ప్రతి జిల్లాకో గులాబీ భవన్
సాక్షి, హైదరాబాద్ : అధికార తెలంగాణ రాష్ట్ర సమితి 29 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించుకునేందుకు ప్రభుత్వ భూములను కేటాయించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గజం వంద రూపాయల చొప్పున జిల్లా కేంద్రాల్లో ఎకరానికి మించకుండా భూములను కేటాయించాలని నిర్ణ యించింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు భూములను కేటాయించే విషయంలో గత ప్రభుత్వాలు అనుసరించిన విధానం ప్రకారమే.. టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణానికి భూములు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో నిర్మించిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కార్యాలయాలకు ఆస్తి పన్ను మినహాయింపు కల్పించింది. శుక్రవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఏడు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో ప్రకటించిన పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. వెంటనే బీసీ జనాభా గణన గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు అవసరమైన బీసీ జనాభా గణన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని నిర్ణయించింది. గ్రామ పంచా యతీల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులు ఉన్నందున గ్రామాల్లో పాలన కోసం ప్రత్యేకాధికారులను నియమించేందుకూ ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఆగస్టు 1వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో సర్పంచ్ల స్థానంలో ప్రత్యేకాధి కారులను నియమించాలని నిర్ణయించింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం.. ప్రస్తుత పాలకవర్గాల గడువు ముగియగానే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సంఖ్య 12,751కి పెరగనుంది. ప్రతీ గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా ఒక కార్యదర్శి ఉండేలా కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శులను నియమించాలని నిర్ణయించింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం పూర్తికాగానే కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారునున్నాయి. కొత్తగా మనుగడలోకి వచ్చే మున్సిపాలిటీల్లోనూ ప్రత్యేకాధికారుల నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ కాలేజీల్లోని ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన అమలు విషయాన్ని పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘తెలంగాణకు కంటి వెలుగు’కార్యక్రమాన్ని ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందించేలా, శస్త్రచికిత్సలను చేసేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలివీ.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు గజం రూ.100 చొప్పున జిల్లా కేంద్రాల్లో ఎకరానికి మించకుండా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు. ఇలాంటి పార్టీల కార్యాలయాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానం ప్రకారమే టీఆర్ఎస్ పార్టీకి 29 జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు. పదవీకాలం ముగుస్తున్న సర్పంచ్ల స్థానంలో ప్రత్యేకాధికారుల నియామకం. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకూ ప్రత్యేకాధికారుల నియామకం. రాష్ట్రంలో కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శుల నియామకం. రాష్ట్రంలోని 12,751 గ్రామాల్లో ప్రతీ గ్రామానికీ కచ్చితంగా ఒక గ్రామ కార్యదర్శి ఉండేలా చర్యలు. రాష్ట్రంలో వెంటనే వెనుకబడిన వర్గాల(బీసీ) జనాభా గణన. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమం. 2019–20 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికీ ఒకటి చొప్పున 119 కొత్త బీసీ గురుకులాల ఏర్పాటు. వీటిలో 4,284 మంది సిబ్బంది నియామకం. గట్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా నాలుగు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం. ప్రతీ నియోజకవర్గానికీ కచ్చితంగా ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలనే విధానం మేరకు రాష్ట్రంలో కొత్తగా 18 అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు. రాష్ట్ర పోలీస్ శాఖకు కొత్తగా 11,577 వాహనాల కొనుగోలు. మందుపాతర పేలుడులో మరణించిన మాజీ మంత్రి మాధవరెడ్డి కుటుంబానికి హైదరాబాద్‌లోని షేక్‌పేటలో 600 గజాల ఇంటి స్థలం కేటాయింపు. భారత్–పాకిస్తాన్ సరిహద్దులో జరిగిన పోరాటంలో మరణించిన వీర జవాను ఫిరోజ్‌ఖాన్ కుటుంబానికి షేక్‌పేటలో 200 గజాల కేటాయింపు. సూర్యాపేటలో మెడికల్ కాలేజీ ఏర్పాటు, సిబ్బంది నియామకం. జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టే అవకాశాల పరిశీలన కేబినెట్ కీలక నిర్ణయాలు.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు గజం రూ.100 చొప్పున జిల్లా కేంద్రాల్లో ఎకరానికి మించకుండా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు. ఇలాంటి పార్టీల కార్యాలయాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు. రాష్ట్రంలో కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శుల నియామకం. రాష్ట్రంలోని 12,751 గ్రామాల్లో ప్రతీ గ్రామానికీ కచ్చితంగా ఒక గ్రామ కార్యదర్శి ఉండేలా చర్యలు. రాష్ట్రంలో వెంటనే వెనుకబడిన వర్గాల(బీసీ) జనాభా గణన. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమం. 2019–20 విద్యా సంవత్సరం నుంచి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికీ ఒకటి చొప్పున 119 కొత్త బీసీ గురుకులాల ఏర్పాటు. వీటిలో 4,284 మంది సిబ్బంది నియామకం. -
టీఆర్ఎస్ భవన్‌కు బాంబు బెదిరింపు
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌ను పేల్చివేస్తామంటూ శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది వెంటనే ఈ సమాచారాన్ని బంజారాహిల్స్ పోలీసులకు అందించడంతో భవన్‌కు దారి తీసే రహదారులతో పాటు చుట్టూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం పోలీసులు భవన్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి సెల్ నంబర్ ఆధారంగా అడ్రస్‌ను కనుగొన్న పోలీసులు అతడిని ఆదిలాబాద్ వాసిగా గుర్తించారు. ఎస్సార్‌నగర్, యూసూఫ్‌గూడ ప్రాంతాల నుండి ఫోన్ వచ్చినట్లు సెల్‌టవర్ ఆధారంగా తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
ఖమ్మంలో టీఆర్ఎస్ భవన్ ప్రారంభం
సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు మంచి స్థానం ఉంటుందని తెలిపారు. పార్టీ కార్యాలయం దేవాలయంగా ఉండాలన్నారు. జిల్లాలో ప్రతి ఇంటికి నల్లా నీరు ఇస్తామని, ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలని తుమ్మల తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. -
టీఆర్ఎస్ భవన్లో బతుకమ్మ వేడుక
-
టీఆర్ఎస్ భవన్లో విలీన దినోత్సవ వేడుకలు
-
ముహూర్తం కుదిరింది !
-
ప్రజాభీష్టం మేరకే జిల్లాల ఏర్పాటు: కర్నె
ప్రజాభీష్టం మేరకే జిల్లాల ఏర్పాటు జరుగుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ అధికార ప్రతినిధి కర్నె ప్రభాకర్ అన్నారు. టీఆర్ఎస్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ..విపక్షాలు విమర్శించడం వల్లనో లేక ఆరోపణలు చేసినందుకో సీఎం కేసీఆర్ జిల్లాల ఏర్పాటులో నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. కేవలం ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు జిల్లాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. విపక్షాలు పనిగట్టుకుని రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. వాళ్ల రాద్ధాంతం అంతా పార్టీని కాపాడుకోవడానికే తప్ప ప్రజల కోసం కాదని అన్నారు. -
టీఅర్ఎస్ భవన్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
'సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం'
హైదరాబాద్ : రాష్ట్రంలోని కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని నిజామాబాద్ ఎంపీ కె.కవిత స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన మేడే వేడుకల్లో ఆమె పాల్గొని... ప్రసంగించారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కార్మికులు కీలక పాత్ర పోషించారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తే మాత్రం అడ్డుకుంటామని కవిత తెలిపారు. -
డీఎస్సీలలో నష్టపోయిన వారికి త్వరలో న్యాయం!
వారి సంఖ్య తేల్చాలని అధికారులకు కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో 1998 నుంచి నిర్వహించిన వివిధ డీఎస్సీల్లో నష్టపోయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు న్యాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సీఎం కేసీఆర్ వారందరికీ న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని, జిల్లాలవారీగా ఎంత మంది నష్టపోయిన అభ్యర్థులున్నారో తేల్చాలని ఆదేశించారు. దీంతో ఆయా అభ్యర్థుల వివరాలను సేకరించాలని డీఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం కేసీఆర్ టీఆర్ఎస్ భవన్‌కు వెళ్లిన సమయంలో తమకు న్యాయం చేయాలంటూ వివిధ డీఎస్సీలలో నష్టపోయిన పలువురు అభ్యర్థులు ఫ్లెక్సీలు ప్రదర్శించడంతో కాన్వాయ్ ఆపి సీఎం వారితో మాట్లాడారు. సోమవారం ఉదయమే విద్యాశాఖ అధికారులను, డీఎస్సీ బాధితులను క్యాంపు కార్యాలయానికి పిలిపించి చర్చించారు. ప్రస్తుతం 1998 డీఎస్సీలో నష్టపోయి న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న అభ్యర్థుల్లో దాదాపు 800 మంది నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఇక ఆ తరువాత డీఎస్సీల్లో నష్టపోయిన వారు మరో 1,500 మందికిపైగా ఉన్నట్లు అంచనా. -
టీఆర్ఎస్ భవన్ ముట్టడికి యత్నం
హైదరాబాద్: మాలమహానాడు కార్యకర్తలు శుక్రవారం టీఆర్ఎస్ భవన్ ముట్టడికి యత్నించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే, బంజారాహిల్స్ పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ... గ్రేటర్ ఎన్నికల్లో మాలల తడాఖా ఏంటో టీఆర్ఎస్కు రుచి చూపిస్తామన్నారు. మాల, మాదిగల మద్య చిచ్చుపెట్టి గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తే టీఆర్ఎస్కు పుట్టగతులుండవని మండిపడ్డారు. -
అమరుల త్యాగం వల్లే తెలంగాణ : నాయిని
-
ఎత్తులు.. పై ఎత్తులు
-
మరోసారి టీఆర్ఎస్ మాక్ పోలింగ్
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ నేడు మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించనుంది. తెలంగాణ భవన్లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే మాక్ పోలింగ్‌కు టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఎంఐఎం పార్టీని కూడా టీఆర్ఎస్ పార్టీ ఆహ్వానించింది. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటో ప్రాధాన్యత ఓటు ద్వారానే ఐదో అభ్యర్థిని గెలుచుకుంటామని టీఆర్ఎస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. -
TRS భవన్లో గణతంత్ర వేడుకలు
-
'టీఆర్ఎస్ భవన్ జోలికి వస్తే టీడీపీ కార్యాలయాలుండవు'
హైదరాబాద్: టీడీపీ తమ పార్టీ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. టీఆర్ఎస్ భవన్ జోలికి వస్తే టీడీపీ కార్యాలయాలు లేకుండా చేస్తామని అన్నారు. టీడీపీ వైఖరి మారకపోతే నల్లగొండ తరహా దాడులు జరుగుతాయని మహేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలో జరిగిన దాడిలో రైతులు, ప్రజలే పాల్గొన్నారని చెప్పారు. -
టీఆర్ఎస్ భవన్ వద్ద కేసీఆర్ కటౌట్ కాల్చివేత
హైదరాబాద్: హైదరాబాద్‌లో టీఆర్ఎస్ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భారీ కటౌట్‌ను దుండగులు తగులబెట్టారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు.