ప్రజాభీష్టం మేరకే జిల్లాల ఏర్పాటు జరుగుతోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.
ప్రజాభీష్టం మేరకే జిల్లాల ఏర్పాటు జరుగుతోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ అధికార ప్రతినిధి కర్నె ప్రభాకర్ అన్నారు. టీఆర్‌ఎస్ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ..విపక్షాలు విమర్శించడం వల్లనో లేక ఆరోపణలు చేసినందుకో సీఎం కేసీఆర్ జిల్లాల ఏర్పాటులో నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. కేవలం ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు జిల్లాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. విపక్షాలు పనిగట్టుకుని రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. వాళ్ల రాద్ధాంతం అంతా పార్టీని కాపాడుకోవడానికే తప్ప ప్రజల కోసం కాదని అన్నారు.