సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్ ఎంపీలు సోమవారం పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పార్టీ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, సంతోష్, బూర నరసయ్యగౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సీతారాం నాయక్, జి.నగేశ్, బీబీ పాటిల్, బి.లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు సమావేశమై ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణానికి స్థలం కేటా యింపుపై వినతిపత్రాన్ని ఇచ్చారు.
పార్లమెంటు లో టీఆర్‌ఎస్‌కు ఉన్న 17 మంది సంఖ్యా బలం ఆధారంగా పట్టణాభివృద్ధి శాఖ నిబంధనల మేరకు తమకు వెయ్యి చదరపు గజాల స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ఆర్పీ రోడ్డులో స్థలాన్ని కేటాయించాలని ప్రధానిని కోరారు. ముందుగా ఢిల్లీలోని సాకేత్, వసంత్ విహార్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ ప్రాం త్రాలను టీఆర్‌ఎస్ ఎంపీలు పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం పరిశీలించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకొని వెళ్లే ముందు సీఎం కేసీఆర్ కూడా ఆయా ప్రాంతాల మ్యాపులను పరిశీలించి తెలంగాణ భవన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చివరికి అన్ని అనుకూలతలను పరిశీలించిన అనంతరం రాజేంద్ర ప్రసాద్ రోడ్ ను ఎంపిక చేసుకున్నారు.
నాకు ఒక్క స్వీటు కూడా ఇవ్వలేదు..
తనను కలసిన టీఆర్‌ఎస్ ఎంపీలతో ప్రధాని మోదీ సరదా సంభాషణ సాగించారు. తెలం గాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజా రిటీతో గెలిచినా తనకు ఒక్క స్వీటు తినిపించలేదన్నారు. మంత్రులు, ఎంపీలకు స్వీట్లు తినిపిం చి నాకు మాత్రం ఇవ్వరా? అని మోదీ సరదాగా అన్నట్టు తెలిసింది. దీనికి స్పందించిన టీఆర్‌ఎస్ ఎంపీలు.. పుల్లారెడ్డి స్వీట్స్ నుంచి ప్రత్యేకంగా బెల్లం, కాజుతో చేసిన స్వీట్లు స్వయంగా తీసుకొచ్చి ఇస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment