meet in
-
ఫిబ్రవరిలో ట్రంప్, కిమ్ భేటీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో ఫిబ్రవరిలో మరోసారి సమావేశమవుతారని వైట్‌హౌస్ తెలిపింది. ఉత్తరకొరియా అణు నిరాయుధీకరణ, క్షిపణి అభివృద్ధి కార్యక్రమంపై ట్రంప్, కిమ్‌లు చర్చిస్తారని వెల్లడించింది. ఈ సమావేశం జరిగే వేదికను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. గతేడాది జూన్ 12న సింగపూర్‌లోని ఓ హోటల్లో ట్రంప్, కిమ్ తొలిసారి భేటీ అయ్యారు. కాగా, ఉత్తరకొరియా అణ్వస్త్రాలను త్యజించేవరకూ ఆంక్షలను కొనసాగిస్తామని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సారా శాండర్స్ తెలిపారు. మరోవైపు, అమెరికా దక్షిణ సరిహద్దులో నెలకొన్న మానవతా సంక్షోభంతో పాటు షట్డౌన్పై శనివారం మధ్యాహ్నం 3 గంటలకు (స్థానికకాలమానం) కీలక ప్రకటన చేస్తానని ట్రంప్ ట్విట్టర్లో తెలిపారు. -
ప్రధానిని కలసిన టీఆర్ఎస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీలు సోమవారం పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పార్టీ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, సంతోష్, బూర నరసయ్యగౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సీతారాం నాయక్, జి.నగేశ్, బీబీ పాటిల్, బి.లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు సమావేశమై ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణానికి స్థలం కేటా యింపుపై వినతిపత్రాన్ని ఇచ్చారు. పార్లమెంటు లో టీఆర్ఎస్కు ఉన్న 17 మంది సంఖ్యా బలం ఆధారంగా పట్టణాభివృద్ధి శాఖ నిబంధనల మేరకు తమకు వెయ్యి చదరపు గజాల స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ఆర్పీ రోడ్డులో స్థలాన్ని కేటాయించాలని ప్రధానిని కోరారు. ముందుగా ఢిల్లీలోని సాకేత్, వసంత్ విహార్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ ప్రాం త్రాలను టీఆర్ఎస్ ఎంపీలు పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం పరిశీలించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకొని వెళ్లే ముందు సీఎం కేసీఆర్ కూడా ఆయా ప్రాంతాల మ్యాపులను పరిశీలించి తెలంగాణ భవన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చివరికి అన్ని అనుకూలతలను పరిశీలించిన అనంతరం రాజేంద్ర ప్రసాద్ రోడ్ ను ఎంపిక చేసుకున్నారు. నాకు ఒక్క స్వీటు కూడా ఇవ్వలేదు.. తనను కలసిన టీఆర్ఎస్ ఎంపీలతో ప్రధాని మోదీ సరదా సంభాషణ సాగించారు. తెలం గాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజా రిటీతో గెలిచినా తనకు ఒక్క స్వీటు తినిపించలేదన్నారు. మంత్రులు, ఎంపీలకు స్వీట్లు తినిపిం చి నాకు మాత్రం ఇవ్వరా? అని మోదీ సరదాగా అన్నట్టు తెలిసింది. దీనికి స్పందించిన టీఆర్ఎస్ ఎంపీలు.. పుల్లారెడ్డి స్వీట్స్ నుంచి ప్రత్యేకంగా బెల్లం, కాజుతో చేసిన స్వీట్లు స్వయంగా తీసుకొచ్చి ఇస్తామని చెప్పారు. -
రజనీకాంత్‌తో కమల్‌హాసన్ భేటీ
సాక్షి, చెన్నై: ప్రముఖ సినీనటులు రజనీకాంత్, కమల్‌హాసన్ చెన్నైలో భేటీ అయ్యారు. పోయెస్ గార్డెన్‌లోని రజనీ నివాసానికి ఆదివారం మధ్యాహ్నం వెళ్లిన కమల్.. ఈ నెల 21న మదురైలో పార్టీ ప్రకటన కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. గంటసేపు భేటీ తర్వాత వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. తామిద్దరం మంచి మిత్రులమనీ, ఏ కార్యక్రమం చేపట్టినా పరస్పరం తెలియజేసుకుంటామని కమల్ చెప్పారు. రాజకీయ కార్యాచరణపై రజనీ తనను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేసినట్లు వెల్లడించారు. సినిమాల తరహాలోనే రాజకీయాల్లో కూడా తామిద్దరి దారులు వేర్వేరని వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి చెన్నై గోపాలపురంలోని నివాసంలో కరుణానిధిని కలిసిన కమల్, ఆయన ఆశీస్సులు అందుకున్నారు. -
స్నేహానికి ప్రతిరూపం ఇందూ-సీత
► 38 ఏళ్లుగా ఒకే ఇంటిలో జీవనం ► వృద్ధాప్యంలోనూ చెదరని చెలిమి ► అనారోగ్యంతో ఉన్న ఇందూకు సీత సపర్యలు ► నేడు ఫ్రెండ్షిప్ డే ఖమ్మం: ‘ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిశాం.. చదువులమ్మ చెట్టు నీడలో.. వీడిపోమంటు..వీడలేమంటు.. ఒక్కటై ఉన్నాం.. చివరి ఆశ.. చివరి శ్వాసతో..’ అనే పాట రూపంగా ఓ ఇద్దరు నిజ జీవితంలోనూ మిత్రులుగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఒకే ఇంటిలో ఉంటూ.. ఒకే బడిలో పాఠాలు బోధించి.. ఒక్కటిగా జీవిస్తున్నారు. అద్దంకి ఇందిర బీఏ, ఎంఈపీ, వేంపాటి సీతామహాలక్ష్మి ఎంఏ, ఎంఏ, బీఈడీ, డీబీహెచ్, పీహెచ్డీ ఈ ఇద్దరు ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో కలుసుకున్నారు. 38 ఏళ్ల క్రితం వీరి మధ్య ఏర్పడిన చెలిమి వృద్ధాప్యంలోనూ తోడుగా ఉంటోంది. శ్రీనివాసనగర్‌లో ఒకే ఇంటిలో ఉంటున్న ఈ ఇద్దరి స్నేహం గురించి.. స్నేహం చిగురించిందిలా.. గుంటూరు జిల్లా నర్సారావుపేటలో జన్మించి అక్కడే విద్యనభ్యసించిన ఇందిర చదువు పూర్తయ్యాక 1968లో ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో గణితం ఉపాధ్యాయురాలుగా చేరారు. సీతామహాలక్ష్మి కృష్ణా జిల్లా విజయవాడలో జన్మించి అక్కడే విద్యనభ్యసించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వోకల్ అండ్ వాయిలెన్ (మ్యూజిక్)లో పీహెచ్డీ చేశారు. హిందీలో పట్టా ఉండటంతో ఈమె కూడా ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలోనే 1978లో హిందీ ఉపాధ్యాయురాలిగా చేరారు. అలా వీరి మధ్య స్నేహం చిగురించింది. నాటి నుంచి ఇద్దరూ ఒకే ఇంటిలో ఉంటూ కలిసి స్కూల్‌కు వెళ్లి విధులు నిర్వహించేవారు. పాఠశాలలో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా వీరిద్దరే కీలకంగా వ్యవహరించేవారు. తల్లిదండ్రులకు వీరిద్దరూ ఒకే ఒక సంతానం. తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలన్నా వీరిద్దరు కలిసే వెళ్లేవారు. ఇద్దరూ పెళ్లికి దూరంగా ఉన్నారు. ఇందిర 1999లో, సీతామహాలక్ష్మి 2013లో పదవీవిరమణ చేశారు. ఇందిర తల్లితండ్రులిద్దరూ మరణించారు. సీతకు తల్లి మాత్రమే ఉంది. 75 ఏళ్లు ఉన్న ఇందిర ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇటీవల పక్షవాతం వచ్చింది. లేవలేని స్థితిలో ఉన్న ఆమెకు 62 ఏళ్ల సీత సపర్యలు చేస్తోంది. వైద్యశాలలో చికిత్స, ఇంటి వద్ద ఫిజియోథెరఫీ చేయించి తిరగగలిగే విధంగా చేశారు. ఈ ఇద్దరు ప్రియమిత్రులను ‘సాక్షి’ కలువగా..‘స్నేహం గొప్పది. మా స్నేహం విడదీయలేనిది. ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వృద్ధాప్యంలోనూ మా స్నేహం చిరస్మరణీయమైనది’ అన్నారు.