రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడి
Published Thu, Dec 29 2016 2:54 PM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటిని మాలమహానాడు నేతలు ముట్టడించారు. బుధవారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడటానికి నిరసనగా.. గురువారం మాలమహానాడు కార్యకర్తలు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఇంటిని ముట్టడించడానికి యత్నించడంతో.. అప్రమత్తమైన పోలీసులు ఆందోళన కారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
Advertisement
Advertisement