ఢిల్లీలో మాల సంఘం నాయకుల ధర్నా | dharna | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మాల సంఘం నాయకుల ధర్నా

Published Wed, Aug 10 2016 12:00 AM | Last Updated on Mon, Oct 8 2018 8:45 PM

dharna

మందమర్రి : ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మాల సంఘం ఆ«ధ్వర్యంలో చేపట్టిన దీక్షలో పట్టణ మాల సంఘం నాయకులు మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాల సంఘం పట్టణ అధ్యక్షుడు పైడిమల్ల నర్సింగ్‌ మాట్లాడుతూ దళితుల ఐక్యత దెబ్బతీసేందుకే కొన్ని రాజకీయ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో పాటు సుప్రీం కోర్టు సైతం వర్గీకరణ సరైంది కాదని తీర్పు చెప్పిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీక్షలో కూర్చున్న వారిలో మెయ్య రాంబాబు, పల్లే నర్సింహులు, కొండ రాములు, బావండ్ల వీరస్వామి తదితరులున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement