నెల్లూరు(సెంట్రల్): ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగ, మాలల మధ్య చిచ్చుపెడుతున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పంచెలు ఊడదీసి తరుముతామని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యనమల సుదర్శన్ హెచ్చరించారు. నెల్లూరులో ఆదివారం జరిగిన మాల మహానాడు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాల, మాదిగల మధ్య కావాలనే వర్గీకరణ పేరుతో వెంకయ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాలలకు వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు.
ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను చంద్రబాబు పక్కదారి పట్టిస్తు న్నారని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాల మొత్తాన్ని టీడీపీ నాయకులకే ఇస్తున్నారని విమర్శించారు. మాలల ఓట్లతో రాజకీయం చేస్తున్న చంద్రబాబు, వెంకయ్యలకు బుద్ధి చెబుతామన్నారు. నెల్లూరులో జూలై 25న పెద్ద ఎత్తున మాలల సభ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వర్ణా వెంకయ్య, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
‘వెంకయ్య పంచెలు ఊడదీసి తరుముతాం’
Published Mon, Mar 27 2017 8:05 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM
Advertisement
Advertisement