‘బీజేపీ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి’
Published Sat, Dec 3 2016 3:51 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన బీజేపీ వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాల మహానాడు డిమాండ్ చేసింది. బీజేపీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించింది. బీజేపీ తీరుకు నిరసనగా శనివారం నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయన్ని ముట్టడించేందుకు యత్నించిన మాలమహానాడు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Advertisement
Advertisement