- ‘బాహుబలి’లో అంబేద్కర్‌ను అవమానించిన వారిపై చర్యకు డిమాండ్
హైదరాబాద్: బాహుబలి చిత్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను, దళితులను అవమానిస్తూ దృశ్యాలను చిత్రీకరించారంటూ మాల సంక్షే మ సంఘం మండిపడింది. దర్శకుడు రాజమౌళి తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన బాహుబలి చిత్రంలోని అభ్యంతరకర దృశ్యాలను సినిమా నుంచి తొలగించాలని, యూట్యూబ్‌లో పెట్టినవారిపై సైబర్ క్రైమ్, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ ఆధ్వర్యంలోని ప్రతి నిధి బృందం నగర సీసీఎస్ డీసీపీ రవివర్మను కలసి ఈ మేరకు ఫిర్యాదు చేసింది.