పౌష్టికాహార నిర్వాహకుల నుంచి లంచం ఆశించి కలెక్టర్ వ్యక్తిగత సహాయకురాలు తిరుచ్చి జైలులో కటకటాలు లెక్కిస్తోంది. తిరుచ్చి కేకే నగర్ సమీపంలోని అలమేలుమంగ నగరానికి చెందిన మాల (48). తంజావూరు కలెక్టర్‌కు వ్యక్తిగత సహాయకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. కాగా పట్టుకోటై సమీపంలోని తవరంకురిచ్చి ప్రభుత్వ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, అన్నైక్కాట్టు ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహార పథకం అమలు పరుస్తున్నారు.
వీటి నిర్వహణ, ఖర్చుల వ్యవహారాలపై తనిఖీ నిర్వహించిన మాల ఆ పౌష్టికాహార నిర్వాహకులైన జోసప్ మిన్ ఇందిర యువరాణి (45), మారియమ్మన్ ప్రైవేటు పాఠశాల నిర్వాహకుడిని పరిశీలించిన ఫైళ్లకు తంజావూరు కలెక్టర్ కార్యాలయానికి తీసుకురావాలని ఆదేశించింది. దీంతో వారు 21వ తారీఖున తంజావూరు కార్యాలయానికి వెళ్లిన పౌష్టికాహార నిర్వాహకులను తలా వెయ్యి రూపాయలు ఇవ్వవలసిందిగా కలెక్టర్ పీఏ మాల డిమాండ్ చేశారు. వారిలో ప్రైవేటు పాఠశాల పౌష్టికాహార నిర్వాహకుడు మాత్రం 500 ఇచ్చారు.
మిగిలిన ఇద్దరు తమ వద్ద డబ్బు లేదని చెప్పడంతో ఇంటికెళ్లి తీసుకురండి అంటూ మాల తిరిగి పంపించేసింది. జోసప్‌మీన్, ఇందిర యువరాణి తంజావూరు అవినీతి వ్యతిరేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె పోలీసుల సూచన ప్రకారం రసాయనం పూసిన డబ్బును మంగళవారం కలెక్టర్ వ్యక్తిగత సహాయకురాలు మాలకు ఇచ్చింది. దీన్ని చాటు నుంచి గమనిస్తున్న పోలీసులు మాలను అరెస్టు చేసి తిరుచ్చి విజిలెన్స్ కోర్టులో హాజరు పరిచి ఆ తరువాత జైలుకు తరలించారు. అలాగే తిరుచ్చి కేకే నగర్‌లో ఉన్న ఆమె ఇంటిని సోదా చేసి కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.