demanding bribe
-
ఏసీబీ వలలో ‘ఔషధ’ ఉద్యోగులు
కరీంనగర్ క్రైం: మెడికల్ షాపు లైసెన్స్ పునరుద్ధరణ కోసం లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఉద్యోగులు ఔషధ నియంత్రణశాఖ ఏడీ కార్యాలయంలో ఏసీబీకి పట్టుబడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన రవీందర్ పదేళ్లుగా శ్రీగణేష్ మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఫార్మాసిస్టు మారడంతో లైసెన్స్ పునరుద్ధరణ కోసం గత నెల 26న ఔషధ నియంత్రణశాఖ ఏడీ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ పెద్ది వినాయక్ రెడ్డిని సంప్రదించాడు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించి రూ.3,500 తీసుకున్నాడు. ఈ నెల 2న మళ్లీ సంప్రదించగా రూ.25 వేలు డిమాండ్ చేశాడు. చివరికి రూ.20 వేలకు అంగీకారం కుదిరింది. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం కరీంనగర్‌లోని చైతన్యపురిలోని ఔషధ నియంత్రణ ఏడీ కార్యాలయంలో రవీందర్ వద్ద నుంచి రూ.20 వేలు తీసుకుంటుండగా వినాయక్‌రెడ్డిని, పని పూర్తయిందని రూ.500 డిమాండ్ చేసిన అటెండర్ ఎండీ.రిజ్వాన్‌ను పట్టుకున్నారు. నిందితులను కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. -
సీబీఐ అధికారులమంటూ లంచాలు.. అరెస్ట్
సాక్షి, ఢిల్లీ : సీబీఐ ఉన్నతాధికారుల పేరుతో లంచాలు డిమాండ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై జనవరి 16న కేసు నమోదు చేసిన సీబీఐ.. హైదరాబాద్ వాసితో పాటు మధురైకి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌కు చెందిన మణివర్ధన్ రెడ్డి, మధురైకి చెందిన సెల్వం రామరాజ్.. బ్యాంకు మోసం కేసుల్లో సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న నిందితులను కలిసి తాము సీబీఐ సీనియర్ అధికారులుగా పరిచయం చేసుకునేవారు. అంతేకాకుండా సీబీఐ న్యూఢిల్లీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్లు సాఫ్ట్వేర్ తయారీ చేసి ఫోన్ కాల్స్ చేసేవారు. కేసులు నుంచి తప్పించేందుకు సహకరిస్తామని ఆశ చూపించి, అందుకుగానూ లంచాలు ఇవ్వాలని డిమాండ్ చేయసాగారు. లంచం ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించేవారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గుంటూరులో బ్యాంక్ కేసు ఆరోణపలు ఎదుర్కొంటున్న నిందితుడిని ఆగంతకులు బెదిరించారు. దీనిపై పిర్యాదు అందుకున్న సీబీఐ అధికారులు చెన్నైలో రెండుచోట్ల, హైదరాబాద్, మధురై, శివకాశిల్లో ఒక చోట తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అనేక మొబైల్ ఫోన్లు, నేరానికి సంబంధించి వాట్సాప్ సంభాషణలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని, దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ శనివారం వెల్లడించింది. -
గొలుసు.. మామూళ్లతో కొలుచు..!
కొద్దినెలల క్రితం దేవనకొండ మండలంలో భూమి సర్వే కోసం రైతులు జిల్లా సర్వే ఏడీని ఆశ్రయించారు. దీంతో ఆయన సంబంధిత సర్వేయర్‌కు ఫోన్ చేసి తక్షణం సర్వే చేయాలని ఆదేశించారు. సర్వే అయితే చేశారు కాని ముడుపులు మాత్రం వదలలేదు. ఏడీ సార్ చెప్పినారు కదా అంటే వాళ్లు చెబుతుంటారు. మాకు ఇవ్వాల్సిందే అంటూ మామూళ్లు వసూలు చేశారు. ఇటీవల డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి కృష్ణగిరి మండలం కోయిలకొండ గ్రామానికి చెందిన ఓ రైతు ఫోన్ చేసి సర్వే కోసం సర్వేయర్ రూ.9వేల లంచం తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. ఆ డబ్బు తిరిగి ఇప్పిస్తానని కలెక్టర్ వీరపాండియన్ హామీ ఇచ్చారు. కలెక్టర్ దృష్టికి పోవడంతో సర్వేయర్ తీసుకున్న మామూళ్లు వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది. సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్): సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నా..కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. సమస్యల పరిష్కారానికి డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టను మంటకలుపుతున్నారు. సర్వే విభాగంలో ఈ తంతు సాగుతోంది. మామూళ్లు ఇవ్వందే సిబ్బంది గొలుసు పట్టడం లేదు. ఈ విభాగంలో ఫీల్డ్ మెజర్‌మెంటు బుక్ (ఎఫ్ఎండీ)లు గల్లంత కావడం చర్చనీయాంశమైంది. ఇవి లేకపోతే భూ సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం లేదు. ఇటువంటి వాటిని భద్రపరచాల్సిన అవసరం ఎంతో ఉన్నా సర్వే, భూమి రికార్డుల విభాగం తగిన చొరవ తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సర్వేకు సంబంధించి 61 సమస్యలు వచ్చాయి. ఇందులో కేవలం 2 మాత్రమే పరిష్కరించారు. 3440 ఎఫ్‌ఎంబీలు గల్లంతు.. జిల్లాలో 914 రెవెన్యూ గ్రామాలు ఉండగా 4,87,761 సర్వే నంబర్లు (ఎఫ్‌ఎంబీలు) ఉన్నాయి. వీటిని డిజిటల్ ఇండియాలో భాగంగా ఎఫ్‌ఎంబీలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను చేపట్టారు. ఇందులో 3440 ఎఫ్‌ఎంబీలు గల్లంతు అయ్యాయి. భూ సమస్యలకు ప్రధాన ఆధారం ఎంఎంబీనే. ఇందులో పొలంలో ఎక్కడెక్కడ ఎన్ని గొలుసులకు సర్వే రాళ్లు ఉండేది స్పష్టంగా ఉంటుంది. సర్వేకు ఎఫ్ఎంబీనే ఆధారం. ఇవే లేవంటే సర్వే విభాగం ఎంత నిర్లక్ష్యంగా ఉందో స్పష్టమవుతోంది. గల్లంతు అయిన ఎఫ్‌ఎంబీలు ఎవ్వరి దగ్గరైన ఉంటే తెచ్చి ఇవ్వాలని సర్వే అధికారులు కోరారు. అయితే స్పందన లేదు. గల్లంతైన ఎఫ్‌ఎంబీలను మళ్లీ తయారు చేసి డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. మామూలుగా అయితే జూన్ నెల చివరికే ఈ తంతు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. వారి రూటే సప‘రేటు’ ముడుపులు ముట్టచెప్పిన వారికి సర్వే చేస్తూ... మిగిలిన దరఖాస్తులు తిరస్కరిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో శాంక్షన్ పోస్టులకు అనుగుణంగా సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లు ఉన్నారు. అంతేగాక 200 మంది వరకు లైసన్స్‌డ్ సర్వేయర్లు ఉన్నారు. ఇంతమంది ఉన్నా సర్వే సమస్యలు మాత్రం ఎక్కడివక్కడే ఉండిపోయాయి. లైసన్స్‌డ్ సర్వేయర్లు మొదలు కొని డిప్యూటీ సర్వేయర్లు, సర్వేయర్లు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎకరాకు ఇంత చొప్పున రేటు నిర్ణయించారు. ఈ ప్రకారం ముట్టచెబితేనే సర్వేయర్లు గొలుసుపడుతారు. సాక్షాత్తు జిల్లా సర్వే అధికారులు చెప్పినప్పటికీ ముడుపులు తీసుకోకుండా సర్వే చేయరంటే అతిశయోక్తి కాదు. -
పిజ్జా లంచం, మహిళా ఎస్ఐ సస్పెన్షన్
లక్నో : ఈ రోజుల్లో లంచం తీసుకోవడమనేది సర్వ సాధారణమైపోయింది. లంచం అనగానే పెద్ద మొత్తంలో డబ్బు లేదా విలువైన వస్తువులు డిమాండ్ చేస్తారు. అయితే ఫిర్యాదు స్వీకరించడానికి ఓ మహిళా ఎస్ఐ చేసిన డిమాండ్ చూస్తే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తనకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేద్దామని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ రెస్టారెంట్ యజమానికి వింత అనుభవం ఎదురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా.. ఎఫ్ఐఆర్ కాపీ కావాలన్నా రెస్టారెంట్ నుంచి పిజ్జా, చిల్లీ చికెన్ తీసుకురావాలంటూ ఇన్స్పెక్టర్ సుమిత్రా దేవి అతడిని డిమాండ్ చేసింది. ఊహించని ఈ పరిణామానికి కంగుతిన్న రెస్టారెంట్ యజమాని ఆమె అడిగిన పిజ్జా తీసుకువచ్చాడు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లింది. విచారణ జరిపిన అధికారులు ఈ విషయం నిజమని తేలడంతో ఆమెను సస్పెండ్ చేశారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు తనకు డబ్బులు చెల్లించారని రెస్టారెంట్ యజమాని రోహిత్ బేరీ పేర్కొన్నాడు. లక్నోలోని హసన్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
లంచం తీసుకుంటు కలెక్టర్ పీఏ అరెస్ట్
పౌష్టికాహార నిర్వాహకుల నుంచి లంచం ఆశించి కలెక్టర్ వ్యక్తిగత సహాయకురాలు తిరుచ్చి జైలులో కటకటాలు లెక్కిస్తోంది. తిరుచ్చి కేకే నగర్ సమీపంలోని అలమేలుమంగ నగరానికి చెందిన మాల (48). తంజావూరు కలెక్టర్‌కు వ్యక్తిగత సహాయకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. కాగా పట్టుకోటై సమీపంలోని తవరంకురిచ్చి ప్రభుత్వ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, అన్నైక్కాట్టు ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహార పథకం అమలు పరుస్తున్నారు. వీటి నిర్వహణ, ఖర్చుల వ్యవహారాలపై తనిఖీ నిర్వహించిన మాల ఆ పౌష్టికాహార నిర్వాహకులైన జోసప్ మిన్ ఇందిర యువరాణి (45), మారియమ్మన్ ప్రైవేటు పాఠశాల నిర్వాహకుడిని పరిశీలించిన ఫైళ్లకు తంజావూరు కలెక్టర్ కార్యాలయానికి తీసుకురావాలని ఆదేశించింది. దీంతో వారు 21వ తారీఖున తంజావూరు కార్యాలయానికి వెళ్లిన పౌష్టికాహార నిర్వాహకులను తలా వెయ్యి రూపాయలు ఇవ్వవలసిందిగా కలెక్టర్ పీఏ మాల డిమాండ్ చేశారు. వారిలో ప్రైవేటు పాఠశాల పౌష్టికాహార నిర్వాహకుడు మాత్రం 500 ఇచ్చారు. మిగిలిన ఇద్దరు తమ వద్ద డబ్బు లేదని చెప్పడంతో ఇంటికెళ్లి తీసుకురండి అంటూ మాల తిరిగి పంపించేసింది. జోసప్మీన్, ఇందిర యువరాణి తంజావూరు అవినీతి వ్యతిరేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె పోలీసుల సూచన ప్రకారం రసాయనం పూసిన డబ్బును మంగళవారం కలెక్టర్ వ్యక్తిగత సహాయకురాలు మాలకు ఇచ్చింది. దీన్ని చాటు నుంచి గమనిస్తున్న పోలీసులు మాలను అరెస్టు చేసి తిరుచ్చి విజిలెన్స్ కోర్టులో హాజరు పరిచి ఆ తరువాత జైలుకు తరలించారు. అలాగే తిరుచ్చి కేకే నగర్లో ఉన్న ఆమె ఇంటిని సోదా చేసి కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.