
శ్రీనివాస్‌కు నియామక పత్రం ఇస్తున్న చెన్నయ్య
పంజగుట్ట: రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలను చైతన్యపరచాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య కోరారు. బుధవారం మాల మహానాడు జాతీయ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఇటీవల మాల మహానాడు రాష్ట్ర కమిటీ రద్దు చేసిన నేపథ్యంలో నూతన రాష్ట్ర అధ్యక్షునిగా జంగా శ్రీనివాస్‌ను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాల మహేశ్, గ్రేటర్ అధ్యక్షునిగా బైండ్ల శ్రీనివాస్‌ను నియమించి వారికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, పీవీ రావు ఆశయాలకు అనుగుణంగా పనిచేయా లని, రాష్ట్రంలో మాలలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ముందుండాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment