సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ.. ఎస్సీ, ఎస్టీ ఉపకులాల మధ్య వైషమ్యాలను పెంచి దళితుల మధ్య ఐక్యతను దెబ్బతీస్తుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పేర్కొన్నారు.
వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మాల మహానాడు చేపట్టిన ఆందోళనలో చెన్నయ్య మాట్లాడుతూ..కొన్ని రాజకీయ పార్టీలు దళి తుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నాయ న్నారు. వర్గీకరణ బిల్లుకు ప్రభుత్వ ఆమోదం తెలపవద్దని కోరుతూ చెన్నయ్య ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పీఎల్ పునియాను కలసి వినతిపత్రం సమర్పించింది.
‘వర్గీకరణ.. ఐక్యతను దెబ్బతీస్తుంది’
Published Wed, Aug 3 2016 3:34 AM | Last Updated on Mon, Oct 8 2018 8:45 PM
Advertisement
Advertisement