
సాక్షి, విజయవాడ: ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాజకీయం చేసి.. పడ్బం గడుపుకోవాలని మందకృష్ణ మాదిగ చూస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్‌కుమార్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు మందకృష్ణ బద్ధ శత్రువు అని ఆయన మండిపడ్డారు. అన్నదమ్ముల్లా ఉన్న మాల, మాదిగల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారని గుమ్మపు సూర్యప్రసాద్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి.. సీఎంస వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారని, మందకృష్ణ మాటలకు ఎవరు భయపడబోరని ఆయన పేర్కొన్నారు.
మందకృష్ణది హేయమైన చర్య..
మందకృష్ణ మాదిగపై ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మందకృష్ణ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంతో చర్చలు జరపకుండా 30న అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం హేయమైన చర్య అని అన్నారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది ఎస్సీ వర్గీకరణ కోసం కాదని, సీఎం వైఎస్ జగన్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకేనని పేరుపోగు వెంకటేశ్వరరావు మండిపడ్డారు.