బాహుబలిలో ఆ సీన్లు తొలగించాలి | telangana malala jac demands for removal of some scenes in bahubali movie | Sakshi
Sakshi News home page

బాహుబలిలో ఆ సీన్లు తొలగించాలి

Published Wed, Jul 8 2015 9:31 AM | Last Updated on Mon, Oct 8 2018 8:45 PM

బాహుబలిలో ఆ సీన్లు తొలగించాలి - Sakshi

బాహుబలిలో ఆ సీన్లు తొలగించాలి

హైదరాబాద్ : బాహుబలి చిత్రంలో మాల కులస్తులను అవమానపరిచే సన్నివేశాలను, మాటలు ఉన్నాయని వాటిని తక్షణమే తొలగించాలని తెలంగాణ మాలల జేఏసీ చైర్మన్ బి.దీపక్ కుమార్ డిమాండ్ చేశారు. ఆ దృశ్యాలను తొలగించకపోతే తెలంగాణలో ఆ చిత్రాన్ని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.

యూట్యూబ్లో మాలలను కించపరుస్తూ ప్రసారమైన సినిమా క్లిప్పింగ్స్ను ఇప్పటికే పోలీసులకు అందచేస్తూ ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని దీపక్ కుమార్ డిమాండ్ చేశారు. మరోవైపు బాహుబలి చిత్రం జూలై 10 శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement