
సాక్షి, రాయ్‌గఢ్ : హౌరా-జగదల్‌పూర్ సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న టవర్‌కార్( ప్రత్యేక రైలు)ను ఢీకొట్టడంతో వెనుక నున్న మూడు బోగీలకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. ఒడిశాలోని హావ్‌డా నుంచి జగదల్‌పూర్ వైపు వెళ్తుండగా కెవుటాగూడ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే లైనులో రైలు, టవర్‌కార్ ఎదురెదురుగా వచ్చి ఢికొనడం వల్ల రెండు జనరల్ బోగీలు, లగేజీ బోగీలో మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది వెంటనే స్పందించడంతో ఇద్దరు మినహా ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.