
ఒడిశా: జయపురం సబ్ డివిజన్ పరిధి బొయిపరిగుడ సమితి మహుళి పంచాయతీ, తొలా గ్రామంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో కొమంత చలానకు చెందిన పూరిళ్లు కాలి బూడిదయ్యింది. ఉదయం 9 గంటల సమయంలో కోమంత చెరువుకు వెళ్లాడని, ఆ సమయంలో హఠాత్తుగా ఇంటికి నిప్పు అంటుకోవడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. మంటలను అదుపు చేసుందుకు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.
దీంతో ఇంట్లోని 7 బస్తాల ధాన్యం, బస్తా చోల్లు, రూ.22 వేల నగదు కాలి బూడిదయ్యాయి. ప్రమాదం వల్ల బాధితుడు సర్వం కోల్పోయి, కుటుంబంతో సహా రోడ్డున పడ్డారు. విషయం తెలుసుకున్న మహుళి మాజీ సర్పంచ్ ధనసాయి పూజారి, నర్సింగ హరిజన్, కుశమఝి, హరిహర హరిజన్ బాధిత కుటుంబానికి బస్తా బియ్యం అందజేశారు. రెవెన్యూ అధికారులు బినోద్ బెహర, కైళిశ బిశ్వాల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వం తరపున సాయం అందిస్తామన్నారు.
షార్డ్ సర్క్యూట్‌తో..
మల్కన్‌గిరి: జిల్లాలోని బలిమెల సమితి 1వ వార్డ్‌లోని మాధన్ బజాంగ్ ఇంట్లో షార్డ్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అంతా ఇంట్లోనే ఉండగా.. భయంతో బయటకు పరుగులు తీశారు. ఇంతలో ఒక్క ఉదుటన ఎగసిన మంటలు.. ఇంటి మొత్తం వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేసే సమయానికి నష్టం జరిగిపోయింది. ఉన్న ఇల్లు కాలిపోవడతంతో మాధన్ పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులతో సహా రోడ్డున పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment