Fire On Durg-Puri Express In Odisha Creates Panic, No Casualities - Sakshi
Sakshi News home page

ఒడిశాలో మరో రైలు ఘటన..ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా రాజుకున్న మంటలు

Published Fri, Jun 9 2023 10:16 AM | Last Updated on Fri, Jun 9 2023 11:05 AM

Fire On Durg Puri Express In Odisha Creates Panic - Sakshi

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం ఘటన మరువకు మునుపే మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఒడిశాలోని నువాపాడ జిల్లాలో గురువారం దుర్గ్‌-పూరి ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు రాచుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే తెలిపింది. ఐతే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది.

ఈ మేరకు దుర్గ్‌ పూరి ఎక్క్‌ప్రెస్‌ గురువారం సాయంత్రం ఖరియార్‌ రోడ్‌ స్టేషన్‌ చేరుకోగానే రైలు బీ32 కోచ్‌లో పొగలు కమ్ముకున్నట్లు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. బ్రేక్‌లు అసంపూర్తిగా వేయడంతో ఒక్కసారిగి బ్రేడ్‌ ప్యాడ్‌లో మంటలు చెలరేగాయి. ఐతే ఆ మంటలు బ్రేక్‌ ప్యాడ్‌ల వరకే పరిమితం కావడంతో.. ఎటువంటి నష్టం జరగలేదని రైల్వే తెలిపింది.

ఈ సమస్య గంటలోపే పరిష్కించబడటంతో రైలు రాత్రి 11 గంటలకు స్టేషన్‌ నుంచి బయలుదేరిందని వెల్లడించింది. గత వారం మూడు రైళ్ల ప్రమాదం మరువక మునేపే ఈ అనూహ్య ఘటన జరగడంతో ఒక్కసారిగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

(చదవండి: పట్టాలు తప్పిన ఊటీ టాయ్‌ ట్రైన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement