దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా, ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో ఉన్నాయి. ఇక కేకేఆర్ నాల్గో స్థానంలో ఉండగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదో స్థానంలో ఉంది. ఆపై సీఎస్‌కే, రాజస్తాన్ రాయల్స్, కింగ్స్ పంజాబ్ వరుస స్థానాల్లో ఉన్నాయి. కాగా, శ్రీలంక పేసర్ ఇసురు ఉదాన ఆర్సీబీకి ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇసురు ఉదాన ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ 40 పరుగులు తగ్గకుండా ఇచ్చాడు. ఇది ఆర్సీబీ పరాజయాల్లో ప్రభావం చూపిందనేది ఆ ఫ్రాంచైజీ అభిమానుల అభిప్రాయం. (ధోని ఒక్కడ్నే బాధ్యుడ్ని చేస్తారా?)
ఒక అభిమాని అయితే ఈ విషయాన్ని ఇసురా ఉదానను అడిగేశాడు. ‘ మీరెందుకు ప్రతీ మ్యాచ్‌లోనూ పరుగులు ఇస్తున్నారు. పవర్ ప్లేలో భారీ పరుగులు సమర్పించుకుంటున్నారు ఎందుకు?’ అని ప్రశ్నించాడు. మరి దీనికి ఏమి సమాధానం మాత్రం ఉదానా తెలివిగా ఇచ్చాడు. ‘ నేను ఎక్కడ ఇస్తున్నాను. బ్యాట్స్‌మన్ బ్యాట్‌తో కొడుతున్నాడు’ అంటూ కొంటెగా సమాధానమిచ్చాడు. ఆర్సీబీ ఆడిన గత మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూసింది. ఢిల్లీతో జరిగిన ఆ మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో ఉదానా వికెట్ తీసినా నాలుగు ఓవర్లలో 40 పరుగులిచ్చాడు. ఇక సైనీ అయితే మూడు ఓవర్లలోనే 48 పరుగులు సమర్పించుకున్నాడు. ఢిల్లీ 196 పరుగులు చేయగా, ఆర్సీబీ 137 పరుగులే చేసి ఓటమి పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment