ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష-2018( టెట్) దరఖాస్తులో పొరపాట్లు చేసిన అభ్యర్థులకు సరిచేసుకునే అవకాశం కల్పిస్తున్నామని టెట్ కన్వీనర్ ఎ. సుబారెడ్డి వెల్లడించారు. రేపు అర్థరాత్రి వరకు పెపర్, సబ్జెక్ట్, మీడియం ఆప్షన్లలలొ మార్పులు చేసుకోవచ్చని తెలిపారు. టెట్ దరఖాస్తులో తమ పొరపాట్లను సరిచేయాలంటూ అభ్యర్థుల చేసిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు. టెట్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదుల ఆప్షన్‌లో పేపర్, సబ్జెక్టు, మీడియం మార్పునకు సదరు అభ్యర్థి ఫిర్యాదు చేసుకోవాలి. అనంతరం వాటిని సరిచేసి అభ్యర్థుల మొబైల్‌కు సక్షిప్త సందేశాలు చేరవేస్తారు. దీని తర్వాతే జిల్లా పరీక్షా కేంద్రాలను ఆప్షన్లుగా ఎంచుకునే అవకాశం ఉంటుందని కన్వీనర్ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment