సెయింట్స్ కిట్స్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. విండీస్ విజయంలో ఆ జట్టు పేసర్ ఒబెద్ మెకాయ్ కీలక పాత్ర పోషించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను మెకాయ్ ముప్పు తిప్పలు పెట్టాడు. తొలి బంతికే కెప్టెన్ రోహిత్ శర్మను పెవిలియన్‌కు పంపి ఆదిలోనే భారత్‌ను మెకాయ్ దెబ్బ కొట్టాడు. ఈ క్రమంలో తన కెరీర్‌లో అత్యత్తుమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు.
ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో మెకాయ్ 17 పరుగులు ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన మెకాయ్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన మెకాయ్.. తనకు దక్కిన ఈ అవార్డును అనారోగ్యంతో ఉన్న తన తల్లికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు. తను ఒక ఉత్తమ ఆటగాడిగా ఎదగడంలో తన తల్లి కీలక పాత్ర పోషించదని మెకాయ్ అన్నాడు.
"దేవుడికి కృతజ్ణతలు చెప్పాలి అనుకుంటున్నాను. దేవుడు దయ వల్ల ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించగలిగాను. నాకు దక్కిన ప్లేయర్ ఆప్‌ది మ్యచ్‌ను మా అమ్మకు అంకిమిస్తున్నా. ఆమె ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోంది. అయినప్పటికీ నన్ను ఆమె ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. అందుకే ఈ అవార్డును తనకి అంకితమివ్వాలి అనుకుంటున్నాను.
ఇక తొలి బంతికే వికెట్ సాధించి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చింది. పవర్‌ప్లేలో ఎప్పుడూ నేను వికెట్లు పడగొట్టడానికి ప్రయత్నిస్తాను. తొలి టీ20లో నేను అంతగా రాణించలేకపోయాను. అయితే అప్పుడు చేసిన తప్పులను ఈ మ్యాచ్‌లో సరిదిద్దు కోవడం సంతోషంగా ఉంది" అని మెకాయ్ పేర్కొన్నాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం(ఆగస్టు2)న జరగనుంది.
వెస్టిండీస్ వర్సెస్ ఇండియా రెండో టీ20:
లగేజీ సమయానికి రాని కారణంగా మ్యాచ్ ఆలస్యం
►వేదిక: వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్, వెస్టిండీస్
►టాస్: వెస్టిండీస్- బౌలింగ్
►ఇండియా స్కోరు: 138 (19.4)
►వెస్టిండీస్ స్కోరు: 141/5 (19.2)
►విజేత: 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపు
►5 మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమం
►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఒబెడ్ మెకాయ్(4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు)
చదవండి: Rohit Sharma: అందుకే ఆవేశ్ చేతికి బంతి! ఇదొక గుణపాఠం... మా ఓటమికి ప్రధాన కారణం అదే!
Comments
Please login to add a commentAdd a comment