IPL 2022 Qualifier 2 RR Vs RCB: రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు ప్రసిద్ కృష్ణ, ఒబెడ్ మెకాయ్‌లను టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ప్రశంసించాడు. తమ అద్భుత బౌలింగ్ నైపుణ్యాలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆటగాళ్లను ఒత్తిడికి గురిచేసి వారిని తక్కువ స్కోరుకే పరిమితం చేశారని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022 క్వాలిఫైయర్-2లో రాజస్తాన్ ఆర్సీబీని ఓడించిన సంగతి తెలిసిందే. బౌలర్ల కృషికి తోడు జోస్ బట్లర్ వీరోచిత ఇన్నింగ్స్‌తో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్లో ప్రవేశించింది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో రాజస్తాన్ బౌలర్లు ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా ప్రసిద్ కృష్ణ కీలక వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లి, ఫినిషర్ దినేశ్ కార్తిక్, ఆల్‌రౌండర్ వనిందు హసరంగ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
మొత్తంగా 4 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక ఒబెడ్ మెకాయ్ సైతం అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. డుప్లెసిస్, మాక్స్‌వెల్ వంటి డేంజరస్ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపాడు. ఇలా వీరిద్దరు ఆర్సీబీని 157 పరుగులకు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ నేపథ్యంలో సచిన్ టెండుల్కర్ యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ...‘‘ప్రసిద్ కృష్ణతో పాటు మెకాయ్ రాజస్తాన్‌కు కీలకంగా మారాడు. వీరిద్దరూ కలిసి బెంగళూరు బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. లోయర్ ఆర్డర్‌లో అద్భుత స్ట్రైక్‌రేటుతో దూసుకుపోతున్న దినేశ్ కార్తిక్‌ను ప్రసిత్ అవుట్ చేశాడు.
హసరంగను బోల్తా కొట్టించాడు. నిజానికి ఇలాంటి పిచ్‌పై 157 స్కోరు ఏమాత్రం చెప్పుకోదగింది కాదు’’ అని పేర్కొన్నాడు. ఆర్సీబీని ఇలా కట్టడి చేసిన ఘనత ప్రసిద్, మెకాయ్‌కే చెందుతున్నాడు. ఇదిలా మిగతా రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ ఒకటి, అశ్విన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
చదవండి 👇
Jos Buttler: అంచనాలు లేకుండా బరిలోకి.. వార్న్ గర్వపడుతూ ఉంటాడు: బట్లర్ భావోద్వేగం
Mathew Wade: 'మా జట్టు ఫైనల్ చేరింది.. అయినా సరే టోర్నమెంట్ చికాకు కలిగిస్తుంది'
Moments we'll never forget. 😍 #RRvRCB pic.twitter.com/yhVLY254vq
— Rajasthan Royals (@rajasthanroyals) May 28, 2022
Chaar chaand lag gaye. 💗🧿 pic.twitter.com/9lEy7B2RMW
— Rajasthan Royals (@rajasthanroyals) May 27, 2022
Comments
Please login to add a commentAdd a comment