Ranji Trophy 2022: Prasidh Krishna Terrific Bowling Figures Details Inside - Sakshi
Sakshi News home page

Prasidh Krishna: బౌలింగ్‌లో దుమ్మురేపాడు.. రాజస్తాన్‌ రాయల్స్‌ పంట పండినట్లే

Published Sat, Feb 26 2022 11:12 AM | Last Updated on Sat, Feb 26 2022 1:11 PM

Prasidh Krishna Terrific Bowling Figures 12-1-35-6 Ranji Trophy 2022 - Sakshi

Ranji Trophy: రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక బౌలర్‌ ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో దుమ్మురేపాడు. ఎలైట్‌ గ్రూఫ్‌-సిలో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌లో ప్రసిధ్‌ 12 ఓవర్లలో 35 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. అతని ధాటికి జమ్ము కశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 93 పరుగలుకే కుప్పకూలింది. 

కాగా ఇటీవలి కాలంలో ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు.  వెస్టిండీస్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో తొమ్మిది వికెట్లు తీసి సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అంతేకాదు విండీస్‌తోరెండో వన్డేలో 9 ఓవర్లలో 12 పరుగులిచ్చి మూడు మెయిడెన్ల సహా నాలుగు వికెట్లు తీసి కెరీర్‌ బెస్ట్‌ సాధించాడు. కాగా ఐపీఎల్‌ మెగావేలంలో ప్రసిధ్‌ కృష్ణను రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 10 కోట్లకు దక్కించుకుంది. ప్రసిధ్‌ కృష్ణ ఫామ్‌ను చూస్తుంటే ఈసారి లీగ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ పంట పండినట్లేనని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. 

కాగా కర్ణాటకకు తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగుల ఆధిక్యం లభించడంతో పటిష్టస్థితిలో నిలిచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన కర్ణాటక 2 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కరుణ్‌ నాయర్‌ 37, కృష్ణమూర్తి సిద్ధార్థ్‌ 53 పరుగులతో ఆడుతున్నారు. కాగా కర్ణాటక ఇప్పటివరకు తొలి ఇన్నింగ్స్‌ కలుపుకొని 417 పరుగుల ఆధిక్యంలో ఉంది.

చదవండి: PSL 2022: రెండుసార్లు బచాయించినా గెలిపించలేకపోయారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement