వెస్టిండీస్ బౌలర్ ఒబెద్ మెకాయ్ టీమిండియాతో జరిగిన రెండో టి20లో సంచలన బౌలింగ్‌తో మెరిశాడు. లగేజీ కారణంగా మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కాగా.. టీమిండియా బ్యాటర్లను విండీస్ బౌలర్ మెకాయ్ ముప్పతిప్పలు పెట్టాడు. తన టి20 కెరీర్‌లోనే బెస్ట్ బౌలింగ్ నమోదు చేసిన మెకాయ్ నాలుగు ఓవర్లలో 17 పరుగులిచ్చి ఒక మెయిడెన్ సహా ఆరు వికెట్లు తీశాడు. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఒబెద్ మెకాయ్ పలు రికార్డులు అందుకున్నాడు.
►టి20 క్రికెట్‌లో ఆరు వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా ఒబెద్ మెకాయ్(6/17) నిలిచాడు. ఇంతకముందు ఈ ఘనత నలుగురు బౌలర్లు అందుకోగా.. అజంతా మెండిస్ రెండుసార్లు ఆరు వికెట్ల ఫీట్‌ను నమోదు చేశాడు. దీపక్ చహర్(6/7, బంగ్లాదేశ్‌పై), అజంతా మెండిస్(6/8, జింబాబ్వేపై), అజంతా మెండిస్ (6/16, ఆస్ట్రేలియాపై), యజ్వేంద్ర చహల్(6/25, ఇంగ్లండ్‌పై ), ఆస్టన్ ఆగర్(6/30, న్యూజిలాండ్‌పై) ఈ ఫీట్‌ను అందుకున్నారు.
►ఇక టీమిండియాపై టి20ల్లో బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసిన బౌలర్లోలో ఒబెద్ మెకాయ్ తొలి స్థానంలో నిలిచాడు. మెకాయ్ తర్వాత వనిందు హసరంగా(4/9), మిచెల్ సాంట్నర్(4/11), డారెన్ సామీ(4/16) ఉన్నారు.
►ఇక వెస్టిండీస్ తరపున టి20ల్లో బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన బౌలర్ల జాబితాలోనూ మెకాయ్ అగ్రస్థానంలో నిలిచాడు. మెకాయ్ తర్వాత కీమో పాల్(5/15), డారెన్ సామి(5/26), జాసన్ హోల్డర్ (5/27), ఒషేన్ థామస్(5/28) ఉన్నారు.
చదవండి: IND vs WI 2nd T20: బెంబేలెత్తించిన విండీస్ బౌలర్.. టీమిండియా ఓటమి
Comments
Please login to add a commentAdd a comment