స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్‌కప్ 2024కు ముందు ఆతిథ్య వెస్టిండీస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ గాయం కారణంగా మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్ సందర్భంగా హోల్డర్ గాయపడినట్లు తెలుస్తుంది.
హోల్డర్ స్థానాన్ని రిజర్వ్ ఆటగాడు ఓబెద్ మెక్‌కాయ్‌తో భర్తీ చేయనున్నట్లు విండీస్ చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ తెలిపాడు. ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్‌లో హోల్డర్ లాంటి అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ లేకపోవడం తమ జట్టుకు పెద్ద లోటే అవుతుందని హేన్స్ అభిప్రాయపడ్డాడు. మెక్‌కాయ్ హోల్డర్ స్థానానికి న్యాయం చేస్తాడని హేన్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్లైన వెస్టిండీస్ ప్రస్తానం జూన్ 2న మొదలవుతుంది. విండీస్ తమ తొలి మ్యాచ్‌లో పపువా న్యూ గినియాతో తలపడుతుంది. విండీస్ గ్రూప్-సిలో పపువా న్యూ గినియా, న్యూజిలాండ్, ఉగాండ, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో తలపడుతుంది.
టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం విండీస్ జట్టు: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), అల్జరీ జోసెఫ్ (వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, షాయ్ హోప్, ఆండ్రీ రస్సెల్, రొమారియో షెపర్డ్, ఒబెడ్ మెక్‌కాయ్, అకీల్ హోసేన్, గుడకేష్ మోటీ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్
రిజర్వ్ ప్లేయర్లు: కైల్ మేయర్స్, మాథ్యూ ఫోర్డ్, ఫాబియన్ అలెన్, హేడెన్ వాల్ష్, ఆండ్రీ ఫ్లెచర్
Comments
Please login to add a commentAdd a comment