హింసాత్మక ఘటనలపై క్రికెటర్ల ఆందోళన | Sangakkara, Jayawardene Condemn Anti Muslim Violence in Sri Lanka | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 8 2018 4:41 PM | Last Updated on Thu, Mar 8 2018 4:41 PM

Sangakkara, Jayawardene Condemn Anti Muslim Violence in Sri Lanka - Sakshi

కుమార సంగక్కర, మహేల జయవర్దనే

సాక్షి, స్పోర్ట్స్‌ : శ్రీలంకలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై ఆ దేశ సీనియర్ క్రికెటర్లు కుమార సంగక్కర, మహేల జయవర్దనేలు ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలు, బుద్దుల మధ్య హింస చెలరేగడంతో అల్లర్లు దేశవ్యాప్తంగా విస్తరించకుండా లంక ప్రభుత్వం పదిరోజుల ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై జయవర్ధనే, సంగక్కరలు ట్విటర్‌లో ఖండించారు.

‘ ఏదో ఒక జాతి, మతాన్ని లక్ష్యంగా చేసుకొని భయపెట్టడం, హింసకు పాల్పడటం మంచిది కాదు. ఒకే దేశం.. ఒకే ప్రజలం అనే భావనతో కలిసి ఉండాలి. ప్రేమ, నమ్మకం, ఆదరణ అనేవి అందరి సాధారణ మంత్రంగా ఉండాలి. జాత్యహంకారం, హింసకు చోటులేదు. వాటిని ఆపేయండి. అంతకలిసి నిలబడి.. బలమైన దేశంగా నిలవాలని’ సంగక్కర ట్వీట్ చేశాడు.

‘ఇటీవల సంభవించిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నా. జాతి, మతంతో సంబంధం లేకుండా ఈ ఘటనలో పాలుపంచుకున్న ప్రతిఒక్కరిని శిక్షించాలి. 25ఏళ్ల పాటు కొనసాగిన సివిల్ వార్ నడుమ పెరిగాను. వచ్చే తరం ఇలాంటి వాతావరణానికి లోనుకాకుడదని కోరుకుంటున్నా.’ అని జయవర్దనే ట్వీట్ చేశాడు.

వీళ్లతో పాటు లంక స్టార్ క్రికెటర్ ఎంజెలో మాథ్యూస్, మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య తదితరులు అల్లర్లను ఖండించారు. ప్రస్తుతం నిదహాస్‌ టీ20 ట్రై సిరీస్‌లో భాగంగా కొలంబోలో ఆతిథ్య శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్ జట్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement