ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు శ్రీలంక మాజీ కెప్టెన్, రాజస్తాన్ రాయల్స్ టీమ్ డైరెక్టర్ కుమార సంగక్కర కొత్త ఫ్రాంచైజీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. రాజస్తాన్ రాయల్స్ హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నియామకం దాదాపుగా ఖారారు కావడంతో.. టీమ్ డైరెక్టర్‌గా ఉన్న సంగక్కర ఆ ఫ్రాంచైజీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
స్పోర్ట్స్ టుడే రిపోర్టు ప్రకారం.. ఐపీఎల్ 2025లో సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా సంగక్కర బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమైనట్లు వినికిడి. ఇప్పటికే అతడితో కేకేఆర్ ఫ్రాంచైజీ చర్చలు జరిపినట్లు స్పోర్ట్స్ టుడే తమ కథనంలో పేర్కొంది.
కాగా గత సీజన్‌లో కేకేఆర్ మెంటార్‌గా పనిచేసిన గౌతం గంభీర్.. ఆఫ్రాంచైజీని వీడి భారత్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో అతడి స్ధానాన్ని ఇంకా ఎవరితో కేకేఆర్ మెనెజ్‌మెంట్ భర్తీ చేయలేదు. ఈ క్రమంలోనే సంగక్కరతో కేకేఆర్ మెనెజ్‌మెంట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ శ్రీలంక క్రికెట్ దిగ్గజం స్ట్రోక్‌ప్లే, మైండ్ గేమ్‌కు పెట్టింది పేరు. అతడి నేతృత్వంలోనే ఐపీఎల్-2022లో రాజస్తాన్ ఫైనల్‌కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment